
రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బిజినెస్ జరుపుకుంది ‘ది వారియర్’ (The Warriorr). రిలీజ్ కూడా అత్యధిక థియేటర్లలో చేశారు. అయితే సరిగ్గా సినిమా విడుదల సమయానికి రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడం, టిక్కెట్ రేట్లు,నెగిటివ్ రివ్యూలు వరస పెట్టి సినిమాపై దాడి చేసాయి. ఊహించని విధంగా ఓపెనింగ్స్ చాలా సాధారణ స్థాయిలో వచ్చాయి. వీకెండ్ కూడా ఈ సినిమా జనాలను థియేటర్స్ కు రప్పించలేకపోయింది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా నాలుగు రోజులకు కాను కేవలం 10 కోట్లు మాత్రమే రికవరీ అయ్యింది. ఈ సినిమాకు 35 కోట్లు థియేటర్ రైట్స్ బిజినెస్ జరిగింది. అంటే 28.5% మాత్రమే రికవరీ అయ్యింది. వీకెండ్ లో కూడా సినిమా నిలబడలేదు అంటే డిజాస్టర్ వైపుగా దూసుకుపోతున్నట్లే లెక్క. మూడు, నాలుగవ రోజుకు చాలా దారణమైన డ్రాప్ కనపడింది. దాదాపు 50% వరకూ నష్టం వస్తుందని అంచనా వేస్తున్నారు. బ్రేక్ ఈవెన్ అనే సమస్యే లేదు.
ది వారియర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బయిటపడాలి అంటే 44 కోట్ల షేర్ కలెక్షన్లు వసూలు చేయాలి. భారీగా బిజినెస్ జరిగిన కారణంగా ఈ సినిమా కలెక్షన్లు ఆ స్దాయిలో రాకపోవటం డిస్ట్రిబ్యూటర్స్ , బయ్యర్లును వణికిస్తోంది.
ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నటించి చిత్రం ‘ది వారియర్’ (The Warriorr). లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా నటించింది. ఆది పిని శెట్టి విలన్‌గా మెప్పించగా.. నదియా, బ్రహ్మాజీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో అలరించారు. జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదలైంది.
డాక్టర్‌గా, ఐపీయస్ ఆఫీసర్‌గా.. రెండు షేడ్స్‌ను ఉన్న పాత్రలో రామ్ తనదైన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ చూపించారు. అయితే స్క్రీన్ ప్లే పరంగానూ జాగ్రత్తలు తీసుకోలేదు.. ఇంటర్వెల్ వరకు ముందుకు కదలదు. క్లైమాక్స్ సాదాసీదాగా ముగించడం అసంతృప్తికి గురి చేస్తోంది. దర్శకుడు ‘ది వారియర్’ కొత్తగా చెప్పే ప్రయత్నం చేయకపోయినా.. స్క్రీన్ ప్లేతో ఆడుకుంటే బాగుండేది. ఎంతసేపు బీ, సీ, సెంటర్ ఆడియన్స్‌కు దృష్టిలో పెట్టుకొని ‘ది వారియర్’ మూవినీ ఊర మాస్గా తెరకెక్కించాలనే తాపత్రయం కనపడుతోంది.