
యంగ్ హీరోయిన్ కృతి శెట్టి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో నటిస్తోంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే ‘ది వారియర్’ మూవీతో అలరిస్తోంది. కృతి శెట్టి నటిస్తున్న మరో చిత్రం ‘మాచెర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam). ఈ మూవీలో హీరో నితిన్ (Nithiin)-కృతి శెట్టి జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. మూవీకి ఎడిటర్ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. పక్కా కమర్షియల్ హిట్ కొట్టాలనే నితిన్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన లుక్ ను కూడా పూర్తిగా మార్చేశాడు.
ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధమైంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. అప్డేట్స్ మీద అప్డేట్స్ ఇస్తూ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలకు అద్భుతమై రెస్పాన్స్ వస్తోంది. తెలుగు హీరోయిన్, గ్లామర్ బ్యూటీ అంజలి ‘రా రా రెడ్డి’ స్పెషల్ సాంగ్ తో ఆకట్టుకుంది. నాలుగు రోజుల కిందనే నటుడు సముద్రఖని (Samutrikhani) ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. తాజాగా కృతి శెట్టి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఈ చిత్రంలో కృతి శెట్టి ‘స్వాతి’ పాత్రలో నటిస్తోంది. విడుదలై పోస్టర్ లో బెబమ్మ చాలా స్టైలిల్ గా కనిపిస్తోంది. సన్ గ్లాసెస్ పెట్టుకొని ట్రెండీ వేర్ ధరించి, కాఫీ తాగుతూ కొంటె చూపుతో ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని నితిన్ సొంత ప్రొడక్షన్ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పైనే నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నిర్మాతలుగా సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి లు వ్యవహరించారు. హీరోయిన్లుగా కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా నటిస్తున్నారు. ఆగష్టు 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.