Latest Videos

పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం వేళ మాజీ భార్య రేణు దేశాయ్ సంచలన సోషల్ మీడియా పోస్ట్!

By Sambi ReddyFirst Published Jun 12, 2024, 1:51 PM IST
Highlights

పవన్ కళ్యాణ్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళుతున్న విషయం తెలిసిందే. ఈ కీలకమైన వేళ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. 
 


ఎన్డీయే కూటమి ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించింది. ఏకంగా 164 సీట్లు కైవశం చేసుకుంది. జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ తో 21కి 21 ఎమ్మెల్యేలు, 2 కి 2 రెండు ఎంపీ స్థానాలు గెలుచుకుంది. నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పెద్దలు పీఎం మోడీ, అమిత్ షా హాజరయ్యారు. 

ఇక పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముందు పవన్ కళ్యాణ్ తన పిల్లలు అకీరా, ఆద్యలతో మాట్లాడాడట.  నాన్న బిగ్ డే నాడు అకీరా, ఆద్య ఇలా తయారై వీడియో కాల్ మాట్లాడారని మాజీ వైఫ్ రేణు దేశాయ్ సోషల్ మీడియాలో అకీరా,ఆద్యల ఫోటోలు షేర్ చేసింది. అలాగే పవన్ కళ్యాణ్ కి బెస్ట్ విషెష్ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ కి మంచి చేయాలన్న ఆయన లక్ష్యం నెరవేరాలని కోరుకుంది. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్ అవుతుంది. 

గతంలో రేణు దేశాయ్ తన పిల్లలకు పవన్ కళ్యాణ్ తండ్రి అంటే ఒప్పుకునేది కాదు. అకీరా, ఆద్య కేవలం నా పిల్లలు మాత్రమే అనేది. ఇప్పుడు నాన్న అంటూ ఆమె స్వయంగా కామెంట్ చేయడం చర్చకు దారి తీసింది. మరోవైపు అకీరా హీరోగా ఎంట్రీ ఇస్తాడంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ అయ్యాడు. ఈ క్రమంలో అకీరా నటవారసుడిగా రావాలి అంటున్నారు. 

అకీరాకు మ్యూజిక్ లో ప్రావీణ్యం ఉంది. ఫిల్మ్ మేకింగ్ కోర్స్ కూడా చేశాడు. ఈ ఆరున్నర అడుగుల కుర్రాడు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తే చూడాలని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. అకీరా హీరో కావడం విషయంలో పూర్తి నిర్ణయం రేణు దేశాయ్ దే అని తెలుస్తుంది. అకీరాను వెండితెరపై చూసేందుకు ఇంకెంత కాలం వేచి చూడాలో. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

click me!