Latest Videos

ఒకే వేదికపై రజినీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్.. చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో అరుదైన దృశ్యం..

By Mahesh JujjuriFirst Published Jun 12, 2024, 12:11 PM IST
Highlights

స్టార్ హీరోలు ఒక చోట కనిపించడం అనేది అరుదుగా జరిగుతుంటుంది. అది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు కాని.. అభిమానులకు మాత్రం ఆ క్షణం పండగనే చెప్పాలి. తాజాగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారవేడుకలో ఆ దృశ్యం కనిపించింది. 


సూపర్ స్టార్ రజినీకాంత్.. మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్.. నటసింహం బాలయ్య.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇలా తారలంతా ఒక చోట కనిపిస్తే.. ఫ్యాన్స్ కు ఎలా ఉంటుంది.. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు కదా.. ఈ అరుదైన సంఘటనకు సాక్ష్యంగా నిలిచింది  చంద్రబాబు ప్రమాణ స్వీకారవేదిక

చంద్రబాబు ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమణా స్వీకారం చేశారు. ఈసందర్భంగా ఆయన క్యాబినేట్ లో  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈసందర్భంగా ఈ కార్యక్రమం అరుదైన దృశ్యాలకు వేదికగా మారింది. ఈప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రాగా.. చంద్రబాబు స్నేహితుడిగా ప్రత్యేక ఆహ్వానం మేరకు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా వచ్చారు. ఇక మంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదే వేదిక మీద ఉండగా.. నటసింహం బాలయ్య బాబు.. తెలుగు దేశం హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా.. వారితో వేదిక పంచుకున్నారు. 

అంతే కాదు తన బాబాయి ప్రమాణ స్వీకారం చూడటానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఆయతో పాటు మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్.. వరుణ్ తేజ్.. వైష్ణవ్ తేజ్ లాంటి హీరోలు ఈ వేడుకల్లో సందడి చేశారు. ఇలా ఇండస్ట్రీకి చెందిన హీరోలంతా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాలు పంచుకోవడ అదరుదైన సంఘటనగా చరిత్రలో నిలిచిపోయింది 

అటు మెగా ప్యాన్స్.. ఇటు నందమూరి ఫ్యాన్స్ తో పాటు..  తలైవా రజినీకాంత్ ఫ్యాన్స్.. దిల్ కుష్ అయ్యారు ఈ అరుదైన దృశ్యాన్నిచూసి.. ఇక చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా.. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ మొదటి సారి ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి గెలుపొందారు. నటసింహం నందమూరి బాలకృష్ణ మూడు సార్లు హిందూపూర్ నుంచి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 

click me!