Bigg Boss Telugu 6: నాగార్జున ఏమి పీకలేపోయావ్ అన్నారు... ఈసారి పీకుదామని!

Published : Oct 14, 2022, 01:09 PM ISTUpdated : Oct 14, 2022, 01:11 PM IST
Bigg Boss Telugu 6: నాగార్జున ఏమి పీకలేపోయావ్ అన్నారు... ఈసారి పీకుదామని!

సారాంశం

కెప్టెన్సీ కంటెండర్ గా ఉన్న ఆదిరెడ్డి బోల్డ్ కామెంట్స్ చేశాడు. అతడు రెండోసారి ఎందుకు కెప్టెన్ కావాలనుకుంటున్నాడో చెప్పే క్రమంలో ఆసక్తికరంగా స్పందించారు. ఇంతకీ ఆదిరెడ్డి ఏమి అన్నారో చూద్దాం...   

వారాలు గడిచే కొద్ది బిగ్ బాస్ షో కొంత ఆసక్తికరంగా మారింది. గేమ్స్, టాస్క్ ఉత్కంఠ రేపుతున్నాయి. గత రెండు వారాల టీఆర్పీ కూడా పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా నేడు హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ జరిగింది. దీని కోసం 'ఆఖరి వరకు ఆగని పరుగు' పేరుతో టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్ లో భాగంగా ఆదిరెడ్డి, వాసంతి మధ్య పోటీ ఏర్పడింది. వీరిద్దరిలో ఒకరిని మిగతా ఇంటి సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలా ఎన్నికైన వారు నెక్స్ట్ లెవెల్ కి వెళతారు. ఇక ఆదిరెడ్డి, వాసంతి ఎందుకు కెప్టెన్ కావాలి అంటుకుంటున్నారో ఇంటి సభ్యులకు చెప్పాలి. 

ఆదిరెడ్డి మాట్లాడుతూ... నేను ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయ్యాను. నాగార్జున సార్ నువ్వు ఏమీ పీకలేకపోయావ్ అన్నారు. కాబట్టి ఇంకోసారి అవకాశం ఇస్తే పీకుదామని, అని చెప్పారు. ఆదిరెడ్డి అలా చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన కామెంట్ కొంచెం బోల్డ్ గా ఉంది. ఇక హౌస్ కంటెస్టెంట్స్ లో కొందరు ఆదిరెడ్డికి మరికొందరు వాసంతికి ఓటు వేయడం జరిగింది . ఇద్దరిలో ఎవరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లారనేది పూర్తి ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు. 

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమోలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాగా ఈ వారానికి బాల ఆదిత్య, ఆది రెడ్డి, గీతూ, సుదీప, శ్రీహాన్, శ్రీసత్య, మెరీనా, కీర్తి, రాజశేఖర్ నామినేట్ అయ్యారు. ఈ తొమ్మిది మంది కంటెస్టెంట్స్ లో ఒకరు ఆదివారం ఎలిమినేట్ కానున్నారు. గత ఐదు వారాల్లో ఐదుగురు కంటెస్టెంట్స్ హౌస్ ని వీడడం జరిగింది. షాని, అభినయశ్రీ,నేహా చౌదరి, ఆరోహిరావు, చంటి వరుసగా ఎలిమినేట్ అయ్యారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్