వింటేజ్ లుక్ లో ప్రభాస్, రికార్డు క్రియేట్ చేసిన రాజా సాబ్ టీజర్

Published : Jun 17, 2025, 10:14 PM IST
The Raja Saab teaser

సారాంశం

ప్రభాస్ మారుతీ కాంబో మూవీ రాజా సాబ్ కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో రాజా సాబ్ టీజర్ రిలీజ్ అవ్వడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈక్రమంలో ఈ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రికార్డ్ స్థాయిలో వ్యూస్ కూడా వచ్చాయి. 

పాన్ ఇండియా స్టార్ హీరో, టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘ది రాజాసాబ్. ఈ సినిమా పై ముందు నుంచే ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి హారర్ కామెడీ థీమ్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది.

జూన్ 16న విడుదలైన ‘ది రాజాసాబ్’ టీజర్‌కు 24 గంటల్లోనే 59 మిలియన్లకు పైగా వ్యూస్ లభించాయి. ఇది ప్రభాస్‌ కెరీర్‌లోనే డిఫరెంట్ మూవీ కాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో ఈ టీజర్‌ కు రికార్డు స్థాయి స్పందన వస్తోంది. ప్రభాస్‌ నటన, డిఫరెంట్ లుక్. కామెడీ ప్లాస్ యాక్షన్, హారర్‌తో మేళవించిన కామెడీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ టీజర్‌ ట్రెండింగ్‌ లో ఉండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపించనున్నాడు. అతనికి జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా, అద్భుతమైన విజువల్స్‌ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

ఈ భారీ చిత్రాన్ని మేకర్స్ డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మరోసారి రికార్డ్ కొట్టేస్తాడంటున్నారు ఫ్యాన్స్. అంతే కాదు ఈ సినిమాతో బాక్సాఫీస్‌ రికార్డులు తిరగరాయడం ఖాయమని మూవీ టీమ్ నమ్మకంతో ఉంది. మరి ఈమూవీ రిలీజ్ తరువాత ఏం జరుగుతుందో చూడాలి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?