ఫోటోగ్రాఫర్స్ పై మండిపడ్డ సమంత, అంత కోపం ఎందుకు వచ్చిందంటే?

Published : Jun 17, 2025, 07:46 PM IST
Samantha

సారాంశం

సమంతకు కోపం వచ్చింది. పొద్దు పొద్దునే తనను విసిగించిన వారిపై ఫైర్ అయ్యింది. స్టాప్ ఇట్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అసలు సమంతకు ఇంత కోపం ఎందుకు వచ్చింది? 

బాలీవుడ్‌లో స్టార్ యాక్టర్స్ కనిపిస్తే ఫోటోలు,వీడియోలు తీయ్యడం కోసం ముంబయ్ లో కొంతమంది రెడీగా ఉంటారు. వారిని పాపరాజీలు ఎప్పుడూ రెడీగా ఉంటారు. స్టార్స్ బయట అడుగుపెడితే వారిని చిత్రీకరించేందుకు పాపరాజీలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. సెలబ్రిటీలు జిమ్, రెస్టారెంట్, షూటింగ్స్, ప్రమోషన్స్ కి వెళ్లిన ప్రతిసారి వీరికి కెమెరా ఫ్లాష్‌లు ఎదురవుతూనే ఉంటాయి. అయితే తాజాగా నటి సమంత పాపరాజీల వల్ల కొంత అసహనానికి లోనైంది.

ఫోటోగ్రాఫర్లపై ఫైర్ అయిన సమంత.

ప్రస్తుతం సమంత ఎక్కువగా ముంబైలో ఉండటం తెలిసిందే. ఈరోజు( 17 జూన్) ఉదయం ముంబైలోని జిమ్‌కి వెళ్లిన ఆమె తిరిగి వస్తుండగా, ఆమెను ఫోటోలు ,వీడియోలు తీయడానికి పాపరాజీలు చుట్టుముట్టారు. సమంత జిమ్ బయట తన కార్ కోసం చూస్తూ నిలబడిన సమయంలో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఆమెను చుట్టుముట్టి రకరకాల ప్రశ్నలు వేశారు.

ఈ పరిస్థితిలో అసహనం వ్యక్తం చేసిన సమంత మొదట "చాలు" అంటూ వారిని ఆపే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వారు ఆగకపోవడంతో, ఆమె "స్టాప్ ఇట్" అంటూ గట్టిగా స్పందించింది. అనంతరం అక్కడి నుండి ఆమె కార్‌లో వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

శుభం సినిమాతో నిర్మాతగా సమంత.

ఇదిలా ఉండగా, సమంత రీసెంట్ గా నిర్మాత అవతారం ఎత్తింది. ‘శుభం’ అనే సినిమాను నిర్మించింది సామ్. ఈ సినిమాలో ఆమె గెస్ట్ రోల్‌లో కూడా కనిపించింది. అంతేకాకుండా, బాలీవుడ్‌లో ఓ వెబ్ సిరీస్‌ లో నటిస్తోంది. ఈసినిమా షూటింగ్ లో సమంత పాల్గొంటోంది. అదే సమయంలో తన సొంత నిర్మాణ సంస్థలో మరో సినిమా పనుల్లోనూ సమంత బిజీగా గడుపుతోంది.

బాలీవుడ్ లో బాగా బిజీ అయిపోయింది సమంత. తెలుగులో ఆమె పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఎక్కువగా బాలీవుడ్ సిరీస్ లు, బాలీవుడ్ సినిమాలపైనే దృష్టి సారించింది. అంతే కాదు నిర్మాతగా ఎక్కువ సినిమాలు చేయడానికి సమంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు సమాచారం.

మయోసైటిస్ సమస్యలో ఇబ్బందిపడ్డ సమంత

సమంత చాలా కాలంగా మయోసైటిస్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఈ వ్యాధికి చికిత్స కూడా తీసుకుంది స్టార్ హీరోయిన్. అంతే కాదు ఈ సమస్య నుంచి బయటపడేందుకు సినిమాలకు దాదాపు ఏడాదికి పైగా విరామం కూడా తీసుకుంది హీరోయిన్. బ్రేక్ తరువాత రీసెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సమంత ఎక్కువగా ముంబయ్ లో ఉంటూ బాలీవుడ్ పై దృష్టి పెట్టింది.

బాలీవుడ్ లో వరుణ్ ధావన్ హీరోగా నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించింది సమంత. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 6, 2024 న రిలీజ్ అయ్యింది. ఇక ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తోంది. అంతే కాదు ఈ సినిమాను ఆమె స్వయంగా నిర్మిస్తోంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi: బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరో, అతడికి కొడుకు పుట్టగానే జాతకం చెప్పిన చిరంజీవి
Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..