బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ భారీ బడ్జెట్ సినిమా, గ్లోబల్ స్టార్ నెక్ట్స్ స్టెప్ ఏంటంటే?

Published : Jun 17, 2025, 09:25 PM IST
vijay deverakonda birthday ram charan to prabhas and these south heros flop in bollywood

సారాంశం

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై రోజుకో న్యూస్‌ వైరలవుతోంది. ప్ర‌స్తుతం పెద్ది సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న చరణ్‌.. నెక్స్ట్‌ ఏ డైరెక్టర్‌ తో సినిమా చేయబోతున్నారు...?

ప్రస్తుతం పెద్ది సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న రామ్ చరణ్ నెక్ట్స్ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు.. ఈ విషయంలో కన్ఫర్మేషన్‌ ఉన్నా.. రూమర్స్ మాత్రం ఆగడంలేదు. త్రివిక్రమ్‌, సందీప్‌ రెడ్డి వంగా డైరెక్టర్స్‌ లిస్ట్‌లోకి ఇప్పుడు ఓ బాలీవుడ్‌ డైరెక్టర్‌ పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఆ డైరెక్టర్‌ ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు ఆడియెన్స్.

త్రివిక్రమ్ తో రామ్ చరణ్ సినిమా ఏమయ్యింది?

రీసెంట్ గా సోషల్‌మీడియా వేదికగా ఒక వార్త తెగ హల్‌చల్‌ చేసింది. రామ్‌ చరణ్‌ హీరో గా దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరిగింది. ఈ న్యూస్‌ మెగా ఫ్యాన్స్ ను ఎంతో ఉత్సాహానికి గురిచేసింది కాని ఇంతలోనే నిర్మాత నాగవంశీ క్లారిటీతో అసలు విషయం బయటకు వచ్చింది.

మొదట్లో త్రివిక్రమ్‌ అల్లు అర్జున్‌తో ఓ మైథలాజికల్‌ ప్రాజెక్ట్‌ చేయనున్నారని టాక్‌ వచ్చింది. అయితే ఆ ప్రాజెక్ట్‌ ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ చేతిలోకి వెళ్లిందని నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ తరఫున నిర్మాత నాగవంశీ ట్వీట్‌ చేశారు. ఈ ప్రకటనతో రామ్‌ చరణ్‌తో త్రివిక్రమ్‌ సినిమా ఉంటుందన్న వార్తలపై తెరపడినట్టైంది.

నిర్మాత నాగవంశీ ట్వీట్‌ తో క్లారిటీ

నాగవంశీ ట్వీట్‌ ప్రకారం, ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ చేతిలో ఉన్న ప్రాజెక్టులు రెండు మాత్రమే. ఒకటి విక్టరీ వెంకటేశ్‌తో చేయబోయే సినిమా, మరొకటి ఎన్టీఆర్‌తో ఉన్న భారీ చిత్రం. ఇక రామ్‌ చరణ్‌తో త్రివిక్రమ్‌ సినిమా ఉంటుందన్న ప్రచారం కేవలం గాసిప్‌ అని తేలిపోయింది.

ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ నాగవంశీ ట్విట్టర్‌లో ఇలా రాసుకొచ్చారు.

"ప్రస్తుతం త్రివిక్రమ్‌ గారు చేస్తున్న సినిమాలు రెండు మాత్రమే – వెంకటేశ్‌ గారితో ఒకటి, ఎన్టీఆర్‌ గారితో మరోటి. మిగిలినవి ఊహాగానాలు మాత్రమే. ఈ ప్రకటనతో చరణ్‌ ఫ్యాన్స్‌ కొంత నిరాశ చెందినా, త్రివిక్రమ్‌ నెక్ట్స్ ప్రాజెక్టులపై స్పష్టత వచ్చింది.

బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా ?

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన బాలీవుడ్‌ డైరెక్టర్‌తో చేయబోయే సినిమా గురించి తాజా వార్త ఒకటే నెట్టింట వైరల్‌ అవుతోంది. బాలీవుడ్‌లో "కిల్‌" అనే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో గుర్తింపు పొందిన దర్శకుడు నిఖిల్ నాగేశ్ భట్‌ ఇప్పుడు రామ్‌ చరణ్‌తో కలిసి ఒక భారీ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.

నిఖిల్ భట్‌ ఇప్పటికే చరణ్‌ కోసం ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ స్టోరీను సిద్ధం చేశారని సమాచారం. బాలీవుడ్‌లో "కిల్‌" సినిమాతో యాక్షన్‌ ఇమేజ్ రాబట్టిన ఈ దర్శకుడు, ఇప్పుడు సౌత్‌లోను తన మార్క్‌ చూపించేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. రామ్‌ చరణ్‌ ప్రస్తుతం పెద్ది సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. చరణ్ తో సినిమా అంటు చాలామంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా రామ్‌ చరణ్‌, నగేష్ భట్‌ కాంబినేషన్‌ గురించి కూడా ఇండస్ట్రీలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

వీరిద్దరి కాంబోలో సినిమా అనేది కొత్త న్యూస్‌ కాదు. గత కొంతకాలంగా రామ్‌ చరణ్‌, నిఖిల్ భట్‌ కాంబినేషన్‌ గురించి ఇండస్ట్రీలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు వీరిలో ఎవరూ కూడా అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌పై స్పందించలేదు.ఇటీవల త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో రామ్‌ చరణ్‌ సినిమా ఉండదని నిర్మాత నాగవంశీ ట్వీట్‌ చేసిన నేపథ్యంలో, మళ్లీ చరణ్-నిఖిల్ భట్‌ కాంబినేషన్‌ వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ తాజా ఊహాగానాలు మేగా అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.

పెద్ది తరువాత సుకుమార్ తో రామ్ చరణ్ సినిమా

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం డైరెక్టర్‌ బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది ఓ మల్టీ-స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నిర్మితమవుతోన్న భారీ బడ్జెట్ సినిమా. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ రామ్‌ చరణ్‌కు జోడీగా నటిస్తోంది. ఈ సినిమా మీద మెగా అభిమానులలో భారీ అంచనాలున్నాయి.

ఈ ప్రాజెక్ట్‌ తర్వాత రామ్‌ చరణ్‌ నెక్స్ట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌తో కలిసి పనిచేయనున్నట్టు అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చేసింది. రంగస్థలం తర్వాత ఈ ఇద్దరి కాంబోలో మరోసారి సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడు మొదలవుతుంది? ఎలాంటి కథతో వస్తుంది? అన్నదానిపై మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.

ప్రస్తుతం మాత్రం రామ్‌ చరణ్‌ ఫోకస్‌ బుచ్చిబాబు సినిమాపై ఉండగా, ఆ తర్వాత సుకుమార్‌ ప్రాజెక్ట్‌ షెడ్యూల్‌లో ఉంది. బాలీవుడ్ సినిమా గురించి అధికారికంగా ఏ ప్రకటన వెలువడలేదు. అందువల్ల నిఖిల్ నగేష్ భట్ తో సినిమా నిజమవుతుందా? లేక మరోసారి గాసిప్‌గా మిగిలిపోతుందా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rithu Chowdary Eliminate: చివరి నిమిషంలో బిగ్‌ బాస్‌ షాకింగ్‌ ట్విస్ట్, రీతూ ఎలిమినేట్‌.. కారణం ఇదే
2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్