Raja Saab Glimpse: `ది రాజాసాబ్‌` గ్లింప్స్ అదిరింది.. రిలీజ్‌ డేట్‌ ఫైనల్‌.. ప్రభాస్‌ కెరీర్‌లో ఫస్ట్ టైమ్‌

Published : Jul 29, 2024, 05:46 PM IST
Raja Saab Glimpse: `ది రాజాసాబ్‌` గ్లింప్స్ అదిరింది..  రిలీజ్‌ డేట్‌ ఫైనల్‌.. ప్రభాస్‌ కెరీర్‌లో ఫస్ట్ టైమ్‌

సారాంశం

ప్రభాస్‌ ఓ వైపు థియేటర్లలో `కల్కి`తో అలరిస్తూనే ఉన్నారు. మరోవైపు ఇప్పుడు మరో సినిమా ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు వస్తున్నారు. `ది రాజాసాబ్‌` మూవీ గ్లింప్స్ తో సర్‌ప్రైజ్‌ చేశారు.

డార్లింగ్‌ ప్రభాస్‌ ఇటీవలే `కల్కి 2898 ఏడీ`తో దుమ్ములేపాడు. ఈ మూవీ ఇంకా థియేటర్లలో రన్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో మరో సర్‌ప్రైజ్‌ వచ్చింది. ఇప్పుడు మరో సినిమాతో సందడి చేసేందుకు వస్తున్నాడు. ప్రభాస్‌ నటిస్తున్న చిత్రాల్లో `ది రాజాసాబ్` కూడా ఉంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి సర్‌ప్రైజ్‌ వచ్చింది. గ్లింప్స్ విడుదల చేసింది టీమ్‌. ప్రభాస్‌ పాత్రని పరిచయం చేస్తూ ఈ గ్లింప్స్ సాగింది. ఆయన తన లవర్‌ కి ప్రపోజ్‌ చేసేందుకు రెడీ అయి వెళ్తున్నట్టుగా ఉంది ఈ గింప్స్. ఫ్లవర్స్ బోకే తీసుకుని కారు అద్దంలో తన అందాన్ని చూసుకుంటూ పూలతో దిష్టి తీసుకోవడం విశేషం. 

ఇందులో ప్రభాస్‌ చాలా అందంగా ఉన్నారు. చాలా క్యూట్‌గా కనిపిస్తున్నాడు. `సలార్‌`, `కల్కి`లో మాస్‌ హీరోగా కనిపించిన ఆయన ఇందులో లవర్‌ బాయ్‌ గా కనిపించడం విశేషం. అమ్మాయిల డ్రీమ్ బాయ్‌ని తలపిస్తున్నాడు. పూర్తి రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్నాడు. గ్లింప్స్ స్వీట్‌ సర్‌ప్రైజింగ్‌గా ఉంది. అదే సమయంలో ఈ సినిమా జోనర్‌ ఏంటో ప్రకటించింది టీమ్‌. హర్రర్‌ రొమాంటిక్‌ కామెడీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో రిలీజ్‌ డేట్‌ని కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది సందడి చేయబోతుందీ మూవీ. ఏప్రిల్‌ 10న ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలోనూ విడుదల చేస్తున్నట్టు వెల్లడించింది. 

బ్యాక్‌ టూ బ్యాక్‌ మాస్‌ సినిమాలు చేసిన ప్రభాస్‌ ఇప్పుడు ఎంటర్‌టైనింగ్‌ రోల్‌లో అలరించబోతున్నాడు. నవ్వించడం, భయపెట్టడంతోపాటు రొమాంటిక్‌ ట్రీట్‌ ఇవ్వబోతున్నాడట. అయితే ఇప్పుడు ప్రభాస్‌ని మాస్‌ హీరోగా చూడాలనుకుంటున్న అభిమానులు.. ఇలా రొమాంటిక్‌ బాయ్‌లా, కామెడీగా డార్లింగ్ ని చూస్తారా? అనేది పెద్ద డౌట్‌. ఇదిలా ఉంటే గ్లింప్స్ కూడా పెద్దగా హైప్‌ తెచ్చేలా లేదు. అయితే ఈ సినిమాతో ఓ ప్రయోగం చేస్తున్నాడు డార్లింగ్‌. మొదటి సారి ఆయన హర్రర్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఎంటర్‌టైనింగ్‌ చిత్రాలు చేశాడు, మాస్‌ యాక్షన్‌ మూవీస్‌ చేశాడు ప్రభాస్‌. కానీ ఈ సారి మాత్రం హర్రర్‌ సినిమాతో అలరించేందుకు వస్తున్నాడు. 

మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇతర నటీనటులు డిటెయిల్స్ ప్రకటించేదు టీమ్. కానీ మాళవిక మోహనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఆమెతోపాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల సహనిర్మాత.  భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్ గా ఈ మూని నిర్మిస్తున్నారు. `రాజా సాబ్‌` సినిమా షూటింగ్ 40 పర్సెంట్ పూర్తయింది. ఆగస్టు 2వ తేదీ నుంచి మరో భారీ షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రభాస్ ను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నారు డైరెక్టర్ మారుతి.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi: ఎన్టీఆర్ కి చుక్కలు చూపించిన కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి, టాలీవుడ్ మొత్తం షేక్
Kriti Sanon: అల్లు అర్జున్‌పై మహేష్‌ బాబు హీరోయిన్‌ ఇంట్రెస్ట్