మెగా డాటర్ నిహారిక నిర్మిస్తున్న తొలి సినిమా `కమిటీ కుర్రోళ్లు`. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేస్తుంది.
కుర్రాళ్ల మధ్య స్నేహం, ఆటలు, గొడవలు, ప్రేమలు ప్రతి ఊరిలోనూ ఉంటాయి. అందులో ఇన్నోసెన్సీ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. పగలు, ప్రతీకారాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కలిస్తేనే అది ఊరు అవుతుంది. పెద్దయ్యాక అవి బెస్ట్ మెమొరీస్‌గా నిలిచిపోతాయి. నిహారికా ఫస్ట్ టైమ్ నిర్మిస్తున్న `కమిటీ కుర్రోళ్లు`లోనూ అవన్నీ పుష్కలంగా ఉన్నట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. విలేజ్‌లో కొంత మంది కుర్రాళ్లు చిన్నప్పట్నుంచి టీనేజ్, యువకులుగా మారే స్థాయి వరకు వివిధ దశలో వారి మధ్య చోటు చేసుకున్న సంఘటన నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.
తాజాగా విడుదలైన `కమిటీ కుర్రోళ్లు` ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అయితే ఇందులో స్నేహంతోపాటు రాజకీయాలు, అవి తెచ్చే గొడవలు, కులాలు, మతాలు తెచ్చే గొడవలు ఊరిని ఎమోషనల్ గా మార్చేసే సీన్లు ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. స్నేహం కంటే విలువైనది ఈ ప్రపంచంలో లేదు. అలాంటి స్నేహం, స్నేహితులు మధ్య కులం, మతం అడ్డుగోలుగా నిలిస్తే ఏమవుతుంది, చిన్ననాటి స్నేహితులు ఫ్రెండ్ షిప్ కంటే కులాలకే ఎక్కువ విలువిస్తారా! ఒకవేళ నిజమైన స్నేహం మధ్య కులాలు, మతాలు అడ్డొస్తే పరిస్థితులు ఎలా మారుతాయి.. కులాలతో విడిపోయిన స్నేహితుల మనసుల్లో సంఘర్షణ ఎలా ఉంటుంది. చివరకు వారు కలిశారా! అనే విషయాలు తెలియాలంటే ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శకుడు యదు వంశీ.
undefined
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక నిర్మాతలు. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, లిరికల్ సాంగ్స్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రం ఆగస్ట్ 9న విడుదలవుతుంది.
శుక్రవారం ట్రైలర్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి హీరో సిద్దు జొన్నలగడ్డ గెస్ట్ గా హాజరయ్యాడు. ఆయన మాట్లాడుతూ, `ఇది చిన్న చిత్రం కాదు. అసలు చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఉండదు. ఓ సినిమాకు తక్కువ ఖర్చు పెడతాం.. ఎక్కువ ఖర్చు పెడతామంతే. ఇది చాలా పెద్ద బడ్జెట్‌తో తీసిన పెద్ద సినిమాలా కనిపిస్తోంది. విజువల్స్ బాగున్నాయి. ఇలా కొత్త వారితో ఇంత మంచిగా చిత్రాన్ని తీయడం అంటే మామూలు విషయం కాదు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. నిహారిక గారు మల్టీ టాలెంటెడ్. నటిస్తున్నారు, నిర్మిస్తున్నారు, షోలు చేస్తున్నారు. ఆమెకు ఈ చిత్రం పెద్ద హిట్ అయి భారీ లాభాల్ని తెచ్చి పెట్టాలి. ఇలాంటి మంచి చిత్రాలు వస్తే ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు, పెద్ద హిట్ చేస్తారు’ అని అన్నారు.
నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ‘షూటింగ్ ఉన్నా కూడా పిలిచిన వెంటనే వచ్చిన సిద్దుకి థాంక్స్. `కమిటీ కుర్రోళ్ళు` అంతా కూడా మూడేళ్లు సినిమా కోసం పని చేస్తూనే ఉన్నారు. అందరూ వారి వారి పాత్రలకు ప్రాణం పోశారు. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.