కెజిఎఫ్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది!

Published : Jan 29, 2021, 08:07 PM IST
కెజిఎఫ్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది!

సారాంశం

యష్ పుట్టినరోజు కానుకగా జనవరి 8న విడుదలైన కెజిఎఫ్ 2 టీజర్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. వందల మిలియన్స్ వ్యూస్ దక్కించుకున్న కెజిఎఫ్ 2 టీజర్ ప్రపంచ రికార్డు నమోదు చేసింది. కాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్ర యూనిట్ నేడు అధికారికంగా ప్రకటించారు.


భాషతో సంబంధం లేకుండా దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కెజిఎఫ్ 2.  దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన కెజిఎఫ్  మొదటి భాగం సంచలన విజయం సాధించిన నేపథ్యంలో చాప్టర్ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక యష్ పుట్టినరోజు కానుకగా జనవరి 8న విడుదలైన కెజిఎఫ్ 2 టీజర్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. వందల మిలియన్స్ వ్యూస్ దక్కించుకున్న కెజిఎఫ్ 2 టీజర్ ప్రపంచ రికార్డు నమోదు చేసింది.

కాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్ర యూనిట్ నేడు అధికారికంగా ప్రకటించారు. జులై 16న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషలలో కెజిఎఫ్ 2 విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. దీనితో కెజిఎఫ్ 2 చిత్ర అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.  బిగ్ స్క్రీన్ పై విజువల్ వండర్ ని చూసి ఎంజాయ్ చేయాలని ఆరాటపడుతున్నారు. 

కెజిఎఫ్ చాప్టర్ 2లో ప్రకాష్ రాజ్ ఓ కీలక రోల్ చేస్తుండడం విశేషం. ఇక బాలీవుడ్ నటి రవీనా టాండన్ లేడీ పీఎం గా పవర్ ఫుల్ పాత్ర చేస్తున్నారు. వీటన్నింటికీ మించి సంజయ్ దత్ మెయిన్ విలన్ అధీరా పాత్ర చేయడం ఆసక్తి కలిగిస్తుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా కెజిఎఫ్ 2 విడుదల తేదీ ప్రకటించి ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేశారు చిత్ర యూనిట్. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి