అమితాబ్ ఆల్ టైం హిట్ షోలే నటుడు కన్నుమూత!

Published : Jan 29, 2021, 06:06 PM IST
అమితాబ్ ఆల్ టైం హిట్ షోలే నటుడు కన్నుమూత!

సారాంశం

సీనియర్ నటుడు అరవింద్ జోషి మరణించారు. 84ఏళ్ల అరవింద్ జోషి కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు అరవింద్ జోషిని కొద్దిరోజుల క్రితం ముంబైలోని నానావ‌తి ఆస్ప‌త్రిలో చేర్పించారు. ఆరోగ్యం విషమించడంతో నేడు ఉద‌యం ఆయన తుది శ్వాస విడిచారు. 

బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు అరవింద్ జోషి మరణించారు. 84ఏళ్ల అరవింద్ జోషి కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు అరవింద్ జోషిని కొద్దిరోజుల క్రితం ముంబైలోని నానావ‌తి ఆస్ప‌త్రిలో చేర్పించారు. ఆరోగ్యం విషమించడంతో నేడు ఉద‌యం ఆయన తుది శ్వాస విడిచారు. అరవింద్ జోషి మరణ వార్తను బంధువు స‌రితా జోషి మీడియాకు తెలియజేశారు. 

బాలీవుడ్‌తోపాటు గుజరాతీ సినిమాల్లో అరవింద్ జోషి కీలక రోల్స్ చేశారు. గుజరాతీ చిత్ర పరిశ్రమలో హీరోగా ఉన్న శ‌ర్మన్ జోషి అతడి కుమారుడు. అమితాబచ్చన్, ధర్మేంద్ర ఆల్ టైం హిట్ షోలే మూవీలో అరవింద్ జోషి ఓ పాత్ర చేశారు. షోలో మూవీలో సంజీవ్ కుమార్ పోషించిన ఠాకూర్ బల్దేవ్ సింగ్ కుమారుడు పాత్రను అరవింద్ జోషి చేయడం జరిగింది. 
షోలేతో పాటు ల‌వ్ మ్యారేజ్‌, నామ్, ఇత్తేఫక్‌‌ వంటి హిందీ చిత్రాలలో అరవింద్ జోషి నటించడం జరిగింది. అలాగే మాతృభాష గుజ‌రాతీలో గ‌ర్వో గ‌రాసియో, ఘెర్ ఘెర్  మ‌తినా చులా త‌దిత‌ర సినిమాలు చేశాడు. 

ఆయ‌న మృతికి బాలీవుడ్‌, గుజ‌రాతీ సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు. అర‌వింద్ జోషికి భార్య‌, ఇద్ద‌రు కుమారులు శ‌ర్మాన్ జోషి, మాన్సి జోషి. వీరిద్దరూ నటులుగా కొనసాగుతున్నారు. శర్మన్‌ జోషి త్రీ ఇడియట్స్‌ సినిమాలో అమీర్‌ ఖాన్‌తో పాటు ఒక హీరోగా నటించారు. 

PREV
click me!

Recommended Stories

Regina Cassandra: ముస్లింగా పుట్టి క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టుకుందో చెప్పేసిన రెజీనా
అఖండ 2 కు ఎదురుదెబ్బ, బాలయ్య సినిమా వసూళ్లలో భారీ పతనం, 4వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?