సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ‘గంగూబాయ్’.. గ్లోబల్ లో నెంబర్ ఇండియన్ ఫిల్మ్ గా ట్రెండింగ్

Published : May 04, 2022, 06:28 PM IST
సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ‘గంగూబాయ్’.. గ్లోబల్ లో నెంబర్ ఇండియన్ ఫిల్మ్ గా ట్రెండింగ్

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) నటించిన చిత్రం ‘గంగూబాయి కథియావాడి’. ఈ చిత్రం ఆడియెన్స్ నుంచి విశేష ఆదరణ పొందింది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా మరో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.   

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్, బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా బన్సాలీ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’ (Gangubai Kathiawadi). సంజయ్ లీలా బన్సాలీ సినిమాలకు ప్రత్యేక అభిమానులు ఉంటారు. ముంబయి మాఫియా క్వీన్ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 25న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. గత నెల ఏప్రిల్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ భాషలో రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేశారు. 

కాగా, గంగూబాయి కతియావాడి విడుదలైన  తొలిరోజు దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.10.50 కోట్లు రాబట్టింది. రెండో రోజు ఈ సినిమా  రూ.13.32 కోట్లు వసూలు చేసింది. మూడవ రోజు రూ.15.30 కోట్లు వసూలు చేసింది.. మొత్తం దేశీయ వారాంతపు వసూళ్లు రూ.39.12 కోట్లకు చేరాయి. ఏప్రిల్ 14 క్లోజింగ్ వరకు భారతదేశంలో రూ.153.69 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో మరో రూ.43.17 కోట్లు వసూలు చేసింది.  ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా రూ.196.86 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. 

అయితే తాజాగా ఈ చిత్రం మరో రికార్డును సొంతం చేసుకుంది. గ్లోబల్ నాన్-ఇంగ్లీష్ చిత్రాల జాబితాలో #1 ర్యాంక్ పొందిన మొదటి భారతీయ చిత్రంగా గుర్తింపు పొందింది. అలియా భట్ కథానాయికగా నటించిన ఈ చిత్రం 25 దేశాల్లో టాప్ 10లో నిలిచింది. దీంతో ఇండియన్ సినిమా సత్తాను చాటింది.  గత నెల ఏప్రిల్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం కేవలం వారంలో రోజుల్లో 13.8 మిలియన్ వాచ్ అవర్స్ ను దక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. 

ఈ చిత్రానికి డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించగా, ఉత్కర్షిణి వశిష్ఠ, హుస్సేన్ జైదీ కథ అందించారు. భన్సాలీ ప్రొడక్షన్స్ మరియు పెన్ ఇండియా లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నిర్మాతగా జయంతిలాల్ గడా వ్యవహరించారు. నటీనటులుగా అలియా భట్, శంతను మహేశ్వరి, విజయ్ రాజ్, ఇందిరా తివారీ, సీమా పహ్వా కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే