Kiara -Sidharth Malhotra: బ్రేకప్ రూమర్స్ కి చెక్ పెట్టిన కియారా-సిద్దార్ధ్ మల్హోత్రా..!

Published : May 04, 2022, 06:25 PM IST
Kiara -Sidharth Malhotra: బ్రేకప్ రూమర్స్ కి చెక్ పెట్టిన కియారా-సిద్దార్ధ్ మల్హోత్రా..!

సారాంశం

గత నెలలో బాలీవుడ్ మీడియాలో కియారా అద్వానీ- సిద్దార్ధ్ మల్హోత్రా  పేర్లు మారుమ్రోగాయి. ఈ జంట విడిపోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ పుకార్లకు కియారా, సిద్దార్ధ్ మల్హోత్రా  చెక్ పెట్టారు. 


కియారా అద్వానీ-సిద్దార్ధ్ మల్హోత్రా(Sidharth Malhotra)మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. తమ రిలేషన్ పై ఎప్పుడూ ఓపెన్ కాకున్నా... సన్నిహితంగా ఉంటూ పరోక్షంగా మీడియాకు హింట్ ఇచ్చారు. కాగా ఈ ప్రేమ జంట మధ్య మనస్పర్థలు తలెత్తాయని, ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారంటూ ఇటీవల కథనాలు వెలువడ్డాయి. ఈ బ్రేకప్ రూమర్స్ పై కూడా ఎవరూ నోరుమెదపలేదు. అయితే ఈద్ పార్టీలో కలిసి సందడి చేసిన కియారా, సిద్దార్ధ్ మల్హోత్రా బ్రేకప్ రూమర్స్ కి చెక్ పెట్టారు. 

సూపర్ స్టార్ సల్మాన్ (Salman Khan) సిస్టర్ అర్పిత ఆమె భర్త ఆయుష్ శర్మ ముంబైలో రంజాన్ (Eid Party)సందర్భంగా పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. బాలీవుడ్ కి చెందిన బడా స్టార్స్, సెలెబ్రిటీలు ఈ విందుకు హాజరయ్యారు. వారిలో కియారా, సిద్దార్థ్ కూడా ఉన్నారు. ఇక ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా...  కరిష్మా కపూర్,  కియారా(Kiara Advani), సిద్దార్ధ్ మల్హోత్రా లతో ఓ సెల్ఫీకి ఫోజిచ్చారు. ఈ సెల్ఫీ ఫోటోను కియారా తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేశారు. 

అలాగే ఈ పార్టీలో ఆమె సిద్దార్ధ్ మల్హోత్రాతో చాలా సన్నిహితంగా మెలిగారు. ప్రియుడు  సిద్దార్ధ్ మల్హోత్రా కి వెల్కమ్ చెప్పడంతో పాటు పార్టీలో ఇద్దరూ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఈద్ వేడుకలో సిద్దార్ధ్ మల్హోత్రా , కియారా ఒకరితో మరొకరు మెలిగిన తీరు చూసిన బాలీవుడ్ జనాలు బ్రేకప్ వార్తల్లో నిజం లేదన్న అభిప్రాయానికి వచ్చారు. ఇక సిద్దార్ధ్ మల్హోత్రా- కియారా కలిసి నటించిన షేర్షా మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 

కాగా కియారా నటించిన బోల్ బులియా 2 విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో ఆర్యన్ కార్తీక్ హీరోగా నటిస్తున్నారు. మరో రెండు బాలీవుడ్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. కాగా కియారా చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ఆర్ సి 15. రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటి వరకు తెలుగులో కియారా భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలు చేశారు. 

PREV
click me!

Recommended Stories

VD14: విజయ్‌ దేవరకొండ వీడీ 14 నుంచి గూస్‌ బంమ్స్ అప్‌ డేట్‌.. రౌడీ బాయ్స్ కాలర్‌ ఎగరేసే టైమ్‌ వచ్చినట్టే
రెమ్యునరేషన్ లేకుండా మహేష్ చేసిన సినిమా ఏదో తెలుసా.? హీరోగా చేసింది పవన్ కళ్యాణ్..