కేరళ స్టోరీపై మోడీ నోట ఆ మాట.. మొన్న కోర్టు, ఇప్పుడు ప్రధాని..గాల్లో తేలిపోతూ నిర్మాత కామెంట్స్

Published : May 06, 2023, 09:55 AM IST
కేరళ స్టోరీపై మోడీ నోట ఆ మాట.. మొన్న కోర్టు, ఇప్పుడు ప్రధాని..గాల్లో తేలిపోతూ నిర్మాత కామెంట్స్

సారాంశం

రిలీజ్ కి ముందే సంచలనంగా మారి అనేక వివాదాలు సృష్టించిన కేరళ స్టోరీ చిత్రం ఈ శుక్రవారం మే 5న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

రిలీజ్ కి ముందే సంచలనంగా మారి అనేక వివాదాలు సృష్టించిన కేరళ స్టోరీ చిత్రం ఈ శుక్రవారం మే 5న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి కొంత మిక్స్డ్ టాక్ కూడా వస్తోంది. కానీ వసూళ్లు బావున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. కేరళలో గత కొన్నేళ్లలో 32 వేలమంది మహిళలు మిస్ అయ్యారని.. వారందరిని ముస్లింలుగా మర్చి బలవంతంగా ఉగ్రవాద సంస్థలలో జాయిన్ చేశారనే అంశంతో దర్శకుడు సుదీప్తో సేన్ ఏఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

అదా శర్మ ఈ చిత్రంలో షాలిని ఉన్నికృష్ణన్ గా ప్రధాన పాత్రలో నటించింది. విపుల్ అమృతలాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం అని దర్శకుడు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే టీజర్, ట్రైలర్ విడులయ్యాక కేరళ స్టోరీ చిత్రం దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చ లేపింది. 

బీజేపీ ప్లాన్ లో భాగంగా ఈ చిత్రాన్ని ఒక ప్రాపగాండా మూవీగా తెరకెక్కించారని ఇందులో ఎలాంటి వాస్తవం లేదు అని ఇతర పార్టీల నేతలు విమర్శించారు. స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి  విజయన్ సైతం ఈ చిత్రాన్ని విమర్శించిన సంగతి తెలిసిందే. కేరళ ప్రతిష్టని దిగజార్చే కుట్రలో భాగంగా ఈ చిత్రాన్ని రూపొందించారు అని ఆయన అన్నారు.

అయితే స్వయంగా ప్రధాని మోడీ కేరళ స్టోరీ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళ స్టోరీ చిత్రం ఉగ్రవాదుల కుట్రని బయట పెట్టే విధంగా ఉందని మద్దతు తెలిపారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మోడీ కేరళ స్టోరీ చిత్రం గురించి ప్రస్తావించారు. స్వయంగా మోడీ అంతటి వారు తమ చిత్రానికి మద్దతు తెలపడంతో చిత్ర నిర్మాత విపుల్ గాల్లో తేలిపోతున్నారు. 

'మాకు ఇంతకంటే ఇంకేం కావాలి. కేరళ హైకోర్టు అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రధాని మోడీ తన ప్రసంగంలో మా చిత్రానికి మద్దతు తెలిపారు. మేం ఈ చిత్రంలో చెప్పిన అంశాన్ని ఆయన హైలైట్ చేశారు. మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం.. ఈ చిత్రం టెర్రరిజం వ్యతిరేకం .. ఏ మతానికి వ్యతిరేకం కాలేదు అని' అంటూ విపుల్ స్పందించారు. 

కేరళ స్టోరీ చిత్ర విడుదల అడ్డుకోవాలని వేసిన పిటిషన్ ని ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఈ చిత్రం విడుదలని ఆపేసేంత వివాదాస్పద అంశాలు ట్రైలర్ లో లేవని కోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అదా శర్మ నటనకి ప్రశంసలు దక్కుతున్నాయి. హిందూ యువతి అయిన ఆమె ట్రాప్ చేయబడి ముస్లిం గా కన్వెర్ట్ అవుతుంది. ఆ తర్వాత ఆమెని బలవంతంగా ఐఎస్ఐఎస్ లో జాయిన్ చేస్తారు. అక్కడ ఆమె ఎలాంటి చిత్రవధ అనుభవించింది అనే.. ఆమె తరహాలో ఇతర కేరళ మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే అంశాలని ఈ చిత్రంలో చూపించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్
Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన