నందమూరి తారకరత్నను తలుచుకుంటూ అలేఖ్య రెడ్డి (Alekhya Reddy) వరుసగా ఎమోషనల్ అవుతున్నారు. తన పోస్టులతో హృదయాలను కదిలిస్తున్నారు. తాజాగా మరో పోస్టుతో తన బాధను వ్యక్తం చేశారు.
నందమూరి తారకరత్న (Taraka Ratna) మరణించి రెండు నెలలు దాటింది. నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అస్వస్థతకు గురై ఆస్పతిలో చేరారు. 20 రోజులకు పైగా ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించిన ఫలితం లేకుండా పోయింది. ప్రాణాలతో పోరాడుతూ బెంగళూరులోని హృదయాల ఆస్పత్రిలో మరణించారు. ఆయన మరణ వార్తను ఇప్పటికీ నందమూరి ఫ్యామిల మెంబర్స్ మరిచిపోలేకపోతున్నారు..
ముఖ్యంగా తారకరత్న మరణంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఒంటరయ్యారు. ఆయన తలుచుకుంటూ ఆవేదన చెందుతున్నారు. తారకరత్న లేరనే చేధునిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా తన భావోద్వేగాన్ని, తారకరత్న పై తనకున్న ప్రేమను వరుసగా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి అలేఖ్య రెడ్డి తారకరత్న గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా భర్తతో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ భావోద్వేగమైన వ్యాఖ్యలు చేశారు.
అలేఖ్య రెడ్డి పోస్టులో.. ‘ఈ జీవితానికి నువ్వు మరియు నేను మాత్రమే!!! మీరు అందించిన జ్ఞాపకాలతో జీవితాంతం బతికేస్తాను. నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం అలేఖ్య రెడ్డి పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. తన పోస్టు నెటిజన్ల హృదయాలను కూడా కదిలించింది.
జై బాలయ్య, నందమూరి హ్యాష్ టాగ్స్ తో తన పోస్టును షేర్ చేయడంతో నందమూరి అభిమానులు స్పందిస్తున్నారు. ధైర్యంగా ఉండండి అలేఖ్య గారు.. అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. తారకరత్న మీతోనే ఉంటారని, మిమ్మల్ని చూస్తేనే ఉంటారంటూ.. ధైర్యం చెబుతున్నారు. అలేఖ్య రెడ్డి తారకరత్నను 2012లో పెళ్లి చేసుకుంది. వీరికి ముగురు సంతానం.