సినీకార్మికుల కోసం మరో గొప్ప నిర్ణయం తీసుకున్న చిరంజీవి!

By team teluguFirst Published Jun 6, 2021, 4:07 PM IST
Highlights

సినీ కార్మికుల కోసం మరో బృహత్తర కార్యక్రమానికి చిరంజీవి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. కార్మికులను కరోనా వైరస్ నుండి కాపాడడం కోసం ఉచిత వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభించనున్నట్లు సమాచారం.


సామాజిక సేవలో ఎవరైనా చిరంజీవి తరువాతే. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులైన, వ్యవస్థలైనా ఇబ్బందికర పరిస్థితులలో ఉంటే కలుగజేసుకొని సాయం చేస్తారు చిరంజీవి. హీరోగా తనని ఆదరించిన ప్రజల కోసం దశాబ్దాల క్రితమే చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించడం జరిగింది. రక్త దానం చేయడం ఎంతటి ఆవశ్యకమో తెలియజేసి, అభిమానులు ఆదిశగా అడుగులు వేసేలా చేసి, ఎందరో ప్రాణాలు కాపాడారు. 


ఇక గత ఏడాది కరోనా వలన విధించిన లాక్ డౌన్ సినీ కార్మికులను ఆర్ధిక ఇబ్బందులలోకి నెట్టివేసింది. కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు చేసి, చిరంజీవి చిత్ర ప్రముఖుల నుండి విరాళాలు వసూలు చేసి, కార్మికులకు అవసరమైన నిత్యావసరాలు సరఫరా చేశారు. ఇటీవల చిరంజీవి ట్రస్ట్ పేరిట ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి కరోనా రోగుల ప్రాణాలు కాపాడుతున్నారు. 


కాగా సినీ కార్మికుల కోసం మరో బృహత్తర కార్యక్రమానికి చిరంజీవి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. కార్మికులను కరోనా వైరస్ నుండి కాపాడడం కోసం ఉచిత వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. అపోలో హాస్పిటల్స్ తో పాటు మరికొన్ని హాస్పిటల్స్ సౌజన్యంతో ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం నిర్వహించనున్నారట. కరోనా బారినపడి ఇప్పటికే చాలా మంది పరిశ్రమ ప్రముఖులు మరణించిన నేపథ్యంలో చిరంజీవి ఆలోచన వారికి ఎంతో మేలు చేయనుంది. 

click me!