బుకింగ్ కౌంటర్ లో టికెట్లు ఇస్తోన్న సమంత!

By Udayavani DhuliFirst Published Nov 20, 2018, 10:43 AM IST
Highlights

స్టార్ హీరోయిన్ సమంతా ఇప్పుడు బుకింగ్ కౌంటర్ లో కూర్చొని వచ్చి పోయేవాల్లందరికీ టికెట్లు ఇస్తోంది. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా..?సమంత, నాగచైతన్య జంటగా దర్శకుడు శివ నిర్వాణ ఓ సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 

స్టార్ హీరోయిన్ సమంతా ఇప్పుడు బుకింగ్ కౌంటర్ లో కూర్చొని వచ్చి పోయేవాల్లందరికీ టికెట్లు ఇస్తోంది. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా..? సమంత, నాగచైతన్య జంటగా దర్శకుడు శివ నిర్వాణ ఓ సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో సామ్, చైతులు మధ్యతరగతి కుటుంబానికి చెందిన భార్యాభర్తలుగా కనిపించనున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సినిమాలో సమంత సింహాచలం రైల్వేస్టేషన్ లో బుకింగ్ క్లర్క్ గా కనిపించనుంది.

షూటింగ్ లో భాగంగా నాగచైతన్య తన బైక్ మీద సమంతను రైల్వేస్టేషన్ కి తీసుకురావడం.. ఆమె వెంటనే టికెట్ కౌంటర్ లోకి వెళ్లి టికెట్లు ఇవ్వడం వంటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. విశాఖపట్టణంలోని గోపాలపట్నం ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

సమంత, చైతులు షూటింగ్ లో పాల్గొనడంతో వారిని చూడాలని స్థానిక ప్రజలు గూమిగూడారు. దీంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. ప్రజలు పెద్ద సంఖ్యలో షూటింగ్ స్పాట్ కి చేరుకొని తమ అభిమానాన్ని తెలియజేశారు. పెద్ది హరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

click me!