‘లైగర్’తో బెస్ట్ టీం దొరికింది.. తెలుగులో స్పీచ్ ఇరగదీసిన అనన్య పాండే..

Published : Aug 20, 2022, 10:18 PM IST
‘లైగర్’తో బెస్ట్ టీం దొరికింది.. తెలుగులో స్పీచ్ ఇరగదీసిన అనన్య పాండే..

సారాంశం

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - అనన్య పాండే (Ananya Panday) కలిసి నటించిన చిత్రం ‘లైగర్’. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈరోజు గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా అనన్య పాండే క్యూట్ స్పీచ్ తో ఆకట్టుకుంది. 

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) 
పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం ‘లైగర్’ (Liger). రిలీజ్ కు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను  ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా కేంద్రంలోని మోతడకలో గల చలపతి ఇన్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ గ్రౌండ్స్ లో ఈ రోజు గ్రాండ్ గా నిర్వహించారు.  ఈవెంట్ కు వేలాదిగా యూత్, ఆడియెన్స్, అభిమానులు తరలివచ్చారు. దర్శకుడు పూరీ జగన్నాథ్, అనన్య పాండే, ఛార్మీ కౌర్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా అనన్య పాండే వేదికపై అద్భుతమై స్పీచ్ తో ఆకట్టుకుంటుంది. ‘లైగర్’తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుండటంతో తెలుగులోనే ప్రేక్షకులను పలకరించింది. యంగ్ బ్యూటీ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. నా పేరు అనన్య పాండే. నాకు ఇది తెలుగులో డెబ్యూ మూవీ. ఈ చిత్రంతో నాకు ది బెస్ట్ టీం దొరికింది. పూరీ, ఛార్మీ, రౌడీ హీరోతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. సినిమా ప్రారంభానికి ముందుకు పూరీ జగన్నాథ్ నాకు ఒక విషయం చెప్పారు. తెలుగు స్టేట్స్ లో ఒక సెంటర్ ఉంది. అదే గుంటూరు. అక్కడే మన సినిమా కొడితే.. ఇండియా షేక్ అవుతుందని చెప్పారు. గుంటూరుకు రావడం, మిమ్మల్ని (ఆడియెన్స్)ను కలుసుకోవడం హ్యాపీగా ఉంది’. అంటూ చాలా చక్కగా మాట్లాడి ఆకట్టుకుంది. ఇక తెలుగు ఆడియెన్స్ మనస్సును దోచుకునేందుకు ట్రెడిషనల్ లుక్ లో ఈవెంట్ కు హాజరై అందరిని ఆకట్టుకుంది. 

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తొలిసారి హిందీలోకి ‘లైగర్’తో ఎంట్రీ ఇస్తుండగా.. ఇటు అనన్య పాండే కూడా  ఈ చిత్రంతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే విజయ్ - అనన్య  పాండే పెయిర్  చాలా రొమాంటిక్ గా ఉందనే టాక్ వస్తోంది. పైగా రిలీజ్ కు ముందే సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇంట్రెస్టింగ్ కథతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయనున్నారు. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్ మరియు పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. అమెరికన్ మాజీ ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్, సీనియర్ నటి రమ్యక్రిష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 25న తెలుగు, హిందీతో పాటు కన్నడ, తమిళం, మలయాళంలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రేపటి నుంచి టికెట్ బుక్కింగ్స్ కూడా స్టార్ట్ కానున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sobhan Babu రిజెక్ట్ చేసిన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో ఎవరు? ఏంటా సినిమా?
Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్