పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సోనమ్ కపూర్ 

By Sambi ReddyFirst Published Aug 20, 2022, 9:11 PM IST
Highlights


బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. 
 

సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో సోనమ్ కపూర్... 20-08-2022న బేబీ బాయ్ కి హృదయపూర్వకంగా ఆహ్వానం పలికాము. ఈ ప్రయాణంలో సహకరించిన వైద్య సిబ్బందికి,  శ్రేయోభిలాషులకు, అభిమానులకు కృతజ్ఞతలు. ఇది ప్రారంభం మాత్రమే, మనకు తెలుసు మన జీవితాలు నిరంతరం మారుతూ ఉంటాయి... అని ఆమె థాంక్యూ నోట్ షేర్ చేశారు. 

2018 లో సోనమ్ కపూర్ ముంబైకి చెందిన పారిశ్రామిక వేత్త ఆనంద్ అహుజా ను వివాహం చేసుకున్నారు. వీరి వివాహం ముంబైలో సన్నిహితులు బంధువుల సమక్షంలో జరిగింది. 

ఇక అనిల్ కపూర్ వారసురాలిగా వెండితెరకు సోనమ్ పరిచయమయ్యారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో సావరియా ఆమె మొదటి చిత్రం. 2007లో విడుదలైన ఈ మూవీలో రన్బీర్ కపూర్ హీరోగా నటించారు. కొన్ని చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఆమె నటించినప్పటికీ.. స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయారు. వివాహం తర్వాత కూడా సోనమ్ నటిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆమె బ్లైండ్ చిత్రంలో నటిస్తున్నారు. సోనమ్ నటించిన చివరి చిత్రం ఏకే అండ్ ఏకే.  ఇక సోనమ్ తల్లయ్యారని తెలుసుకున్న ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
 

click me!