Jeremy Renner : ఢిల్లీలో ‘అవెంజర్స్’ హీరో జెరెమీ రెన్నర్.. ఎందుకొచ్చాడు.. ఏం చేశాడంటే?

Published : May 21, 2022, 01:26 PM IST
Jeremy Renner : ఢిల్లీలో ‘అవెంజర్స్’ హీరో జెరెమీ రెన్నర్..   ఎందుకొచ్చాడు.. ఏం చేశాడంటే?

సారాంశం

మార్వెల్ స్టార్ జెరెమీ రెన్నర్ (Jeremy Renner) తాజాగా ఇండియాలో అడుగుపెట్టాడు. తన రాబోయే సిరీస్ షూటింగ్ కోసం దేశంలో పర్యటించారు. బాలీవుడ్ స్టార్ అనికపూర్ తో కలిసి షూటింగ్ లో పాల్గొన్న ఆయన తిరిగి వెళ్తూ భావోద్వేగంగా స్పందించారు.   

మార్వెల్ స్టార్ జెరెమీ రెన్నర్ తాజాగా భారతదేశ పర్యటనను ముగించుకున్నాడు. తిరిగి వెళ్తూ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. అయితే జెరెమీ తన రాబోయే డిస్నీ+ రియాలిటీ సిరీస్ రెన్నర్వేషన్షూ షూటింగ్ కోసం గత వారం నుంచి దేశంలోనే ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రాజస్థాన్ లో అల్వార్ సిటీలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ (Anil Kapoor)తో కలిసి షూటింగ్ లో పాల్గొన్నాడు. ఆయన చిత్రీకరణ ముగియడంతో తిరిగి ప్రయాణం అయ్యాడు. ఈ సందర్భంగా శుక్రవారం  జెరెమీ ఇక్కడి సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఇకపై భారతదేశంలో తన ప్రదర్శన పెరిగిందనే చెప్పుకొచ్చాడు జెరేమీ. శనివారం ఉదయం అల్వార్ లోని తన అభిమానులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఒక వీడియోను కూడా పోస్ట్ చేశాడు. 

ఇన్ స్టాలో పోస్టులు పెడుతూ ఇలా రాసుకొచ్చాడు. ‘ఈ పనిని పూర్తి చేయడానికి మాతో కలిసి చాలా కష్టపడిన భారతదేశంలోని మా అద్భుతమైన సిబ్బందికి ధన్యవాదాలు! మేము ఏమి చేస్తున్నామో చెప్పకుండా ఉండలేకపోతున్నాను’ అంటూ పేర్కొన్నాడు. అలాగే జెరెమీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లోనూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అతను ఎడారిలోని గ్రామీణ ప్రాంత అభిమానులను ఉత్సాహపరుస్తూ కనిపించాడు. ‘అందరికీ ధన్యవాదాలు’ అనే క్యాప్షన్ తో హార్ట్ ఎమోజీలను వదిలాడు. ఇందుకు ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతన్నారు. మరో పోస్ట్ లో ‘అందమైన దేశం మరియు సంస్కృతి' అంటూ ప్రశంసించారు.

భారత పర్యటనకు వచ్చిన ఆయన ఢిల్లీలోని ఓ హోటల్ లాబీలో అభిమానితో కలిసి పోజులిచ్చాడు.  ఆ ఫొటోలను కూడా ఇన్ స్టాలో అభిమానులతో పంచుకున్నాడడు. చాలా మంది అభిమానులు అతని చూడటానికి కలిసేందుకు వచ్చారు. ఇక్కడి ఫ్యాన్స్ తో జెరెమీ చాలా కనెక్ట్ అయ్యారు. ఆయన చేసిన పోస్ట్ కు ఓ నెటిజన్ ‘అతనికి భారత పౌరసత్వం ఇవ్వాలి’ అంటూ కామెంట్ చేశాడు. అంటే జెరెమీపై అభిమానులు ఎంతలా ప్రేమ చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. జెరెమీ ‘థోర్, మిషన్ ఇంపాసిబుల్, అవెంజర్స్’సిరీస్ లలో నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.  

 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు