తండ్రైన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్... దేవుడిచ్చిన గొప్ప వరమంటూ ఎమోషనల్!

By Sambi ReddyFirst Published May 21, 2022, 1:10 PM IST
Highlights

నటుడు సుధాకర్ కోమకుల భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్త సుధాకర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో సన్నిహితులు, పరిశ్రమ ప్రముఖులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. 
 


లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ తండ్రయ్యారు. ఆయన భార్య హారిక మే14న అబ్బాయికి జన్మనిచ్చారు. ఈ విషయం కాస్త లేటుగా వెలుగులోకి వచ్చింది. యూఎస్ లోని చికాగో రాష్ట్రంలో హారిక ఉంటుండగా.. అక్కడే ప్రసవించారు. ఇక ఈ ఆనంద క్షణాలను సన్నిహితులు, అభిమానులతో ఈ జంట పంచుకున్నారు. దేవుడిచ్చిన అతిపెద్ద బహుమతిగా అభివర్ణిస్తున్నారు. ఇక అబ్బాయికి అప్పుడే నామకరణం కూడా చేశారు. శివుడుకి మరో పేరైన రుద్ర అని పేరు పెట్టారు. 

2002లో విడుదలైన మనసుతో చిత్రంతో సుధాకర్ వెండితెరకు పరిచయమయ్యాడు. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ సుధాకర్ కి ఫేమ్ తెచ్చింది. మిడిల్ క్లాస్ అబ్బాయి నాగరాజు పాత్రలో సుధాకర్ ఆకట్టుకున్నారు. ఆ సినిమాలో సుధాకర్ ది కూడా ఓ లీడ్ రోల్. అయితే ఈ మూవీ తర్వాత ఆయనకు బ్రేక్ రాలేదు. 

HAPPIEST NEWS! Extremely elated to announce that we have been blessed with a baby BOY this 14th May at Chicago, USA.
We named him “RUDRA” (Lord Shiva). One who drives away evil & who is praiseworthy!
Need your blessings to our ❤ 🙏 pic.twitter.com/twvNBnnKQA

— Sudhakar Komakula (@UrsSudhakarK)

రవితేజ హిట్ మూవీ క్రాక్ లో కానిస్టేబుల్ పాత్ర చేశాడు. అలాగే కార్తికేయ హీరోగా విడుదలైన రాజా విక్రమార్క మూవీలో పోలీస్ అధికారి పాత్ర చేశాడు. కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ కావాలని సుధాకర్ ప్రయత్నాలు చేస్తున్నారు. 

click me!