Rajamouli About Alia Bhatt: ‘ఆర్ఆర్ఆర్’లో అలియాను అందుకే ఎంపిక చేశాడంటా.. జక్కన్న మాములోడు కాదు..

Published : Mar 18, 2022, 06:05 PM IST
Rajamouli About Alia Bhatt: ‘ఆర్ఆర్ఆర్’లో అలియాను అందుకే ఎంపిక చేశాడంటా.. జక్కన్న మాములోడు కాదు..

సారాంశం

దర్శకధీరుడు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తెరకెక్కించిన భారీ చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు.  ఈ సందర్భంగా జక్కన్న మాట్లాడుతూ ఈ మూవీలో ‘అలియా భట్’నే ఎందుకు ఎంపిక చేశాడో వివరించాడు.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ (RRR). మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సందర్భగా మూవీ స్టార్స్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌(Ram Charan) కలిసి నటించిన చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie). ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. సంక్రాంతికి సినిమా విడుదల కాబోందని అన్ని భాషల్లోనూ ప్రమోషన్‌ కార్యక్రమాలు చేశారు. కానీ ఊహించని విధంగా సినిమా వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. 

అయితే ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ ను చాలాజోరుగా నిర్వహిస్తున్నారు. ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో ఆడియెన్స్ అటెషన్ ను డ్రా చేసేందుకు భారీగా చిత్ర ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. నిన్న కర్ణాటకలో ఈవెంట్ నిర్వహించిన ఈ చిత్రం యూనిట్... నేడు  దుబాయ్ లో ప్రమోషన్ కారక్రమాలను గ్రాండ్ గా నిర్వహించింది. ఈ సందర్భంగా అక్కడి తెలుగు ఆడియెన్స్ ఈ టీమ్ కు స్వాగతం పకలికారు.  అనంతరం మీడియాతో ఇంటరాక్ట్ అయిన ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్.. మూవీకి సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ డిటెయిల్స్ ను వివరించారు. ముఖ్యంగా డైరెక్టర్ రాజమౌళి మాట్లాడిన సందర్భంగా మూవీలో అలియా భట్ ను ఎందుకు?.. ఎంపిక చేశాడో తెలిపాడు.

మీడియాతో ఇంటరాక్ట్ అయిన సందర్భంలో ఓ విలేఖరి రాజమౌళికి  ప్రశ్నిస్తూ.. ‘ఆర్ఆర్ఆర్ లో అలియా భట్ నే ఎందుకు తీసుకున్నారు.?’  అన అడిగాడు. ఇందుకు జక్కన్న స్పందిస్తూ.. ‘అలియా భట్ వ్యక్తిత్వానికి, ఆర్ఆర్ఆర్ లోని  సీత పాత్రకు దగ్గరి పోలికలు ఉన్నాయి. నేను ఊహించిన కథలో..  అలియా పాత్ర  మేరకు ఒదిగిపోయే గుణం ఉంది. అందుకే అలియాను ఎంపిక చేసుకున్నాం’ అని తెలిపాడు. అలాగే రామ్ చరణ్ - ఎన్టీఆర్ ల మంచి స్నేహం  ఉన్న కారణంగా వారిద్దరిని కొమురం భీం.. అల్లూరి సీతారామరాజుగా ఎంచుకున్నట్టు కూడా గతంలోనే తెలిపాడు.  ఇలా నటీనటుల వ్యక్తిత్తాలను, వారి ఇన్నర్ ఎమోషనల్స్ ను గుర్తిస్తూ.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ కు తారాగణాన్ని ఎంపికచేయడం పట్ల సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. నెటిజన్లు ‘జక్కన్న మాములోడు  కాదు’ అంటూ పొగిడేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?