RGV Comments: రాధేశ్యామ్ గురించి ఆర్జీవి హాట్ కామెంట్స్... జనాలకు విజువల్ ఫీస్ట్ అక్కర్లేదన్న వర్మ

Published : Mar 18, 2022, 03:41 PM ISTUpdated : Mar 18, 2022, 04:26 PM IST
RGV Comments: రాధేశ్యామ్ గురించి ఆర్జీవి హాట్ కామెంట్స్... జనాలకు విజువల్ ఫీస్ట్  అక్కర్లేదన్న వర్మ

సారాంశం

ఇండస్ట్రీలో ఏ విషయంలోనైన రామ్ గోపాల్ వర్మ స్పందన కోసం ఎదురు చూస్తుంటారు నెటిజన్లు. ఆయన కూడా అందరిలా కాకుండా తన మార్క్ ట్వీట్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఇక రీసెంట్ గా ఆయన  రాదేశ్యామ్ గురించి తనదైన శైలిలో స్పందించారు వర్మ.   

రామ్ గోపాల్ వర్మ అటేనే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్. తన మార్క్ కామెంట్లతో.. ట్వీట్టర్ ను దడదడలాడిస్తుంటాడు వర్మ. ఆయన ఎప్పుడు దేనిగురించి ఎలా స్పందిస్తారా అని..నెటిజన్లు ఎదురుచూస్తుంటారు. అంతే కాదు వర్మ కూడా ఔత్సాహికులను నిరాశపరచకుండా... తూటాల్లాంటి మాటలతో నెటిజన్లను ఎంటర్టైన్ చేస్తుంటాడు. రీసెంట్ గా ఆయన రాధేశ్యామ్ మూవీ గురించి కూడా కామెంట్స్ చేశాడు.  

భారీ బడ్జెట్ సినిమాలపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఒక నటుడి ముందు సినిమా సాధించిన వసూళ్ల ఆధారంగానే ఆయన నెక్ట్స్ సినిమాపై అంచనాలు ఉంటాయన్నారు వర్మ. రాధే శ్యామ్ గురించి కూడా వర్మ హాట్ కామెంట్స్ చేశారు. ప్రభాస్ రెమ్యునరేషన్ ను పక్కన పెడితే.. ఆ చిత్రాన్ని మొత్తం బడ్జెట్ లో ఐదో వంతు ఖర్చుతో తీసేయవచ్చన్నారు వర్మ. 

 అభిమానులకు విజువల్ ఫీస్ట్ అవసరం లేదంటున్నారు రామ్ గోపాల్ వర్మ. మరీ ముఖ్యంగా ఆయన ఏం చెప్పారంటే.. కథలోని ఎమోషన్స్ ను విజువల్ ఫీస్ట్ చంపేస్తుందన్నారు. బాలీవుడ్  మూవీ ది కశ్మీర్ ఫైల్స్ గురించి కూడా వర్మ కామెంట్స్ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకూ కూడా ఎవరికీ తెలియదని. 4 నుంచి 5 కోట్లతో రూపొందిన ఈ సినిమా 100 కోట్లను వసూలు చేసిందన్నారు రామ్ గోపాల్ వర్మ. విజువల్ ఎఫెక్ట్స్ కంటే కథలో ఉండే దమ్ము ముఖ్యమంటున్నారు వర్మ. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చీరకట్టులో ప్రభాస్ హీరోయిన్, కుందనపు బొమ్మ నిధి అగర్వాల్.. వైరల్ ఫోటోషూట్
ఒక్క రాత్రికి 3 కోట్లు.. శిల్పా శెట్టి రెస్టారెంట్ ఆదాయం తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే ?