Tharun bhaskar:తరణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ ట్రక్ యాక్సిడెంట్ ముచ్చట

Surya Prakash   | Asianet News
Published : May 25, 2022, 06:40 AM IST
Tharun bhaskar:తరణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ ట్రక్ యాక్సిడెంట్ ముచ్చట

సారాంశం

 గతంలో జరిగిన ఓ సీరియస్ యాక్సిడెంట్ గురించి వివరించారు.  'పెళ్లి చూపులు' సినిమా సమయంలో ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అయిన సంఘటనను గుర్తుచేసుకున్నారు.  

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అగ్ర నటి సమంత ఇద్దరూ కలిసి నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్‌లో జరుగుతోంది.   ఈ సందర్భంగా ఓ యాక్షన్ సన్నివేశం నిమిత్తం కారు డ్రైవ్ చేస్తుండగా..అత్యంత ప్రమాదకరమైన సీన్ షూట్ జరిగింది. నదికి రెండువైపులా కట్టిన తాడుపై కారు నడపాల్సిన పరిస్థితి. దురదృష్టవశాత్తూ ఆ వాహనం పట్టు తప్పి కారులో పడిపోయిందనే వార్త  వార్త హల్ చల్ చేసింది.  సమంత, విజయ్ దేవరకొండ ఇద్దరికీ స్పైనల్ కార్ట్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారని   అన్నారు. అయితే ఆ తర్వాత అదంతా ఫేక్ అని టీమ్ తేల్చేసారు. అయితే నిజమైన యాక్సిడెంట్ అయిన వైనం తరుణ్ భాస్కర్ బయిటపెట్టారు.

 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు తరుణ్​ భాస్కర్ రీసెంట్ గా అలీతో సరదాగా పోగ్రామ్ లో పాల్గొన్నారు.  ఆ సరదా ఇంటర్వూలో భాగంగా గతంలో జరిగిన ఓ సీరియస్ యాక్సిడెంట్ గురించి వివరించారు.  'పెళ్లి చూపులు' సినిమా సమయంలో ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అయిన సంఘటనను గుర్తుచేసుకున్నారు.

తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. "ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అవ్వగానే అప్పటివరకు భయపడ్డ విజయ్​ సడన్​గా రిలాక్స్​ అయిపోయాడు. ప్రియదర్శి హ్యాండ్​ బ్రేక్​ తీయగానే అది చేతులోకి వచ్చేసింది. తర్వాత ట్రక్కు వెళ్లి చెట్టును ఢీ కొట్టింది. అందరం బతికిపోయాం. అయితే నేను బతికి ఉన్నానన్న దానికంటే విజయ్​ ఎందుకలా కూల్​గా ఉన్నాడో తెలుసుకోవాలన్న ఆతృత ఉందప్పుడు. వెంటనే విజయ్​ దగ్గరకు వెళ్లి ఎందుకంత రిలాక్స్​గా ఉన్నావని అడిగితే.. 'మొదట భయమేసింది, కానీ తర్వాత అందరం చచ్చిపోతాం కదా, ఏముంది' అని సమాధానం చెప్పడంతో షాకయ్యా" అని అన్నారు తరుణ్​ భాస్కర్​.

ఇక  ఆయన.. 'విజయ్​ దేవరకొండతో మళ్లీ సినిమా చేసే అవకాశం ఉందా' అన్న ప్రశ్నకు సమాధానం చెప్పారు. "నాకు వరుసగా మూడు ఫ్లాప్​లు వచ్చాక విజయ్​ దేవరకొండను వైల్డ్​ కార్డ్​లా వాడతా" అని అన్నారు.  ఇక చదువులో తాను పెద్దగా ఆసక్తి చూపించే వాడిని కాదని బ్యాక్ బెంచర్ కావడంతో తాను కట్టిన సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజులతో ఒక బిల్డింగ్ కట్టవచ్చని చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ మాల్యా కూతురి పెళ్లికి వెళ్లాను అని పేర్కొన్న ఆయన ఒక కెమెరా పట్టుకుని దీపిక పదుకొనేను ఫాలో అవమని చెప్పారని తాను అదే చేశాను అని చెప్పుకొచ్చాడు.

PREV
click me!

Recommended Stories

Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్
Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్