
అడవి శేష్ (Adivi Sesh) హీరోగా నటించిన చిత్రం `మేజర్` (Major). శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న బయోగ్రాఫికల్ యాక్షన్ చిత్రమిది. సాయీ మజ్రేఖర్, శోభితా దూళిపాళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2008లో ముంబయిలో జరిగిన 26/11 ఘటనలో పోరాడిన ఇండియన్ మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
అయితే, మేజర్ మూవీ ఇప్పటికే హిట్ టాక్ ను సొంతం చేసుకుంటోంది. మరోవైపు ఆడియెన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటోంది. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా టైమ్ ఉన్నా.. ఫ్యాన్స్ కోసం ముందే ప్రీ రిలీజ్ ఫిల్మ్ స్క్రీనింగ్ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ఫిల్మ్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి రిలీజ్ ను చూస్తున్నారు. ఈరోజు నుంచి ఆడియన్స్ కోసం దేశవ్యాప్తంగా 9 నగరాల్లో.. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూర్, కొచ్చి, లక్నౌవ్, జైపూర్, అహ్మదాబాద్, ముంబయ్, పూణే, నగరాలలో సినిమాను ప్రదర్శించారు.
ఈ స్పెషల్ స్కీనింగ్ కు ఆడియెన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. బుక్ మై షో ద్వారా టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం అందించారు మేకర్స్. కాగా, తొలి రోజే పూణె, అహ్మదాబాద్, జైపూర్ లో ఇప్పటికే టికెట్స్ క్లోజ్ అయ్యాయి. తాజాగా నటుడు శేషు ఈ సిటీల్లో టికెట్స్ సోల్డ్ అవుట్ అని ప్రకటించారు. Major మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజు చిత్ర యూనిట్ అహ్మదాబాద్, జైపూర్ లో ప్రమోషన్స్ చేయనున్నారు. ఆడియెన్స్ రెస్పాన్స్ ను లైవ్ చూడనున్నారు. కాగా, జూన్ 3న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ, మళయాళంలో రిలీజ్ చేస్తున్నారు.