ఇది కరెక్ట్ టైటిల్.. డౌట్ అనవసరం: తారక్ కామెంట్

Published : Oct 06, 2018, 08:51 PM IST
ఇది కరెక్ట్ టైటిల్.. డౌట్ అనవసరం: తారక్ కామెంట్

సారాంశం

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. అయితే సినిమాకు సంబందించిన కొన్ని విషయాలను తారక్ మీడియా ముందు వివరించారు. 

తారక్ మాట్లాడుతూ.. త్రివిక్రమ్ నాకు దర్శకుడు కాకముందు నుంచే మంచి మిత్రుడు. ఆయనతో సినిమా చేయాలనీ చాలా కాలంగా కల కన్నాను. ఆ కల అరవింద సమేత ద్వారా నెరవేరింది. చాలా కాలంగా మిత్రులమైనప్పటికీ సినిమా చేయడానికి సమయం చాలా పట్టింది. ఎన్నిసార్లు అనుకున్నప్పటికీ కుదరలేదు. ఈ సినిమాతో నెరవేరడం హ్యాపీగ ఉందని అన్నారు. 

ఇక అరవింద సమేత వీర రాఘవ అనే టైటిల్ గురించి వివరిస్తూ.. ప్రతి మగాడి ఆయుధం ఓ మహిళ.నిజంగా ఇది అద్భుతమైన టైటిల్. దేవుళ్లను సైతం.. లక్ష్మీ సమేత నరసింహ స్వామి, సీతా సమేత శ్రీరాముడు అంటూ పిలుస్తుంటాం. అందుకే టైటిల్ పై ఎలాంటి డౌట్ అవసరం లేదు. త్రివిక్రమ్ సినిమా అంటే కథ గురించి ఆలోచించే అవసరం లేదు. కథతో పాటు మంచి మాటలు ఉంటాయి. మా ఇద్దరి కాంబినేషన్ నుంచి ఎలాంటి సినిమా రావాలో అలాంటి సినిమానే వస్తోంది అని ఎన్టీఆర్ తెలిపారు.   

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?