#RRR: స్పీడ్ పెంచిన జక్కన్న!

Published : Oct 06, 2018, 08:04 PM IST
#RRR: స్పీడ్ పెంచిన జక్కన్న!

సారాంశం

దర్శకదీరుడు రాజమౌళి తెరక్కించనున్న #RRR మల్టీస్టారర్ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా ఒకే తెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది అనేది ఊహలకు అందడం లేదు.

దర్శకదీరుడు రాజమౌళి తెరక్కించనున్న #RRR మల్టీస్టారర్ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా ఒకే తెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది అనేది ఊహలకు అందడం లేదు. ఆ విషయం జక్కన్నకు బాగా తెలుసు. అందుకే సినిమా కోసం చాలా టైమ్ తీసుకున్నాడు. 

నవంబర్ నాటికీ వర్క్ షాప్ పనులను ఫినిష్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు. తారక్ - చెర్రీ  ప్రాజెక్టు డిస్కర్షన్స్ లో వారానికోసారి పాల్గొంటూనే ఉన్నారు. ఇక ఇటీవల వర్క్ షాప్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన విషయాలను గురించి రాజమౌళి కథానాయకులిద్దరికి శిక్షణ ఇచ్చాడట. వివరణ ఇచ్చిన అనంతరం ఎమోషనల్ సీన్స్ ప్రాముఖ్యత గురించి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. 

స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసుకున్న జక్కన్న కొన్ని స్పెషల్ సెట్స్ కూడా సినిమా కోసం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులను ఫినిష్ చేసి షూటింగ్ స్టార్ట్ చేయాలనీ రాజమౌళి ప్రయత్నిస్తున్నాడు. డివివి.దానయ్య నిర్మించనున్న ఈ సినిమా 2020లో విడుదల కానుంది.    

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే