నితిన్‌ `తమ్ముడు` ట్రైలర్‌ రివ్యూ.. అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడి యుద్ధం

Published : Jun 11, 2025, 05:34 PM IST
thammudu movie still

సారాంశం

నితిన్‌ హీరోగా రూపొందుతున్న మూవీ `తమ్ముడు`. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌ ఎలా ఉందో చూద్దాం. 

నితిన్‌ ప్రస్తుతం `తమ్ముడు` చిత్రంతో రాబోతున్నారు. ఈ మూవీ వచ్చే నెలలో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో తాజాగా బుధవారం సాయంత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. `తమ్ముడు` బ్యాంగర్‌ పేరుతో ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. 

వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తుంది. ఒకప్పటి హీరోయిన్‌ లయ రీఎంట్రీ ఇస్తుంది. ఇందులో ఆమె కీలక పాత్రలో నటిస్తుంది. నితిన్‌కి అక్క పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.

`తమ్ముడు` ట్రైలర్‌ వచ్చేసింది..

తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఎంగేజ్‌ చేసేలా ఉంటుంది. అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు చేసే పోరాటే ఈ మూవీ అని తెలుస్తుంది. సినిమా చాలా వరకు రాత్రి సమయంలో సాగుతుంది. 

యాక్షన్‌ సీన్లు గూస్‌ బంమ్స్ తెప్పించేలా ఉన్నాయి. అదే సమయంలో నితిన్‌ చేసే యాక్షన్‌ కూడా కొత్తగా ఉంది. ఆయన విల్లు పట్టి ప్రత్యర్థులను వెంటాడిన తీరు బాగుంది. కత్తి పట్టి చేసే ఫైట్‌ అదిరిపోయింది.

`తమ్ముడు` మూవీ ట్రైలర్‌ రివ్యూ

అయితే ఓ అడవి ప్రాంతంపై విలన్‌ కన్నుపడింది. దాన్ని లాక్కోవాలని చూస్తాడు, మెల్లిగా చెబితే వినరు, దీంతో హింసని సృష్టించాలని భావిస్తాడు. ఆ ఊరు జనాలను అందరిని చంపేయాలని, ఆ ఊరినే లేకుండా చేయాలని ప్లాన్‌ చేస్తాడు. అందుకోసం ఎంతకైనా తెగిస్తాడు. 

వారి కోసం అటు సప్తమి గౌడ పోరాడుతుంది. అక్క ఇచ్చిన మాట కోసం నితిన్‌ రంగంలోకి దిగుతాడు. మరి ఆ విలన్‌ని ఎలా అడ్డుకున్నాడు? అనేది సినిమా కథగా ఉండబోతుందని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. 

ట్రైలర్‌ ప్రారంభంలో `మీ అక్కని చూశావా.. తను చనిపోవడానికి రెడీగా ఉంది గానీ, క్యారెక్టర్‌ని మాత్రం కోల్పోలేదు` అని నితిన్‌తో హీరోయిన్ సప్తమి గౌడ చెబుతుండగా, చేసిన తప్పు వల్ల ఆవిడ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఆ మాట నిలబెట్టే ఛాన్స్ వచ్చింది` అని నితిన్‌ చెప్పడం ఆకట్టుకుంది.

స్ట్రాంగ్‌ కంటెంట్‌తో రాబోతున్న నితిన్‌

ఆ తర్వాత మధ్యలో `ప్రపంచానికి ప్రేమతో చెబితే అర్థం కాదు. వాయిలెన్స్ తో చెబితే` అని విలన్‌ అనడం, ఆ తర్వాత అడవిలో హింసాత్మక వాతావరణం చోటు చేసుకుంటుంది. చివర్లో `మాట పోయి మనిషి బతికినా, మనిషి పోయినట్టే లెక్క. మాట బతికి మనిషి పోతే, మనిషి బతికున్నట్టే లెక్క` అని నితిన్‌ చెప్పడం అదిరిపోయింది. 

ఈ సందర్భంగా ఆయన కత్తి పట్టి చేసే యాక్షన్‌ హైలైట్‌గా నిలిచింది. చివర్లో లయ, నితిన్‌ మధ్య ఎమోషనల్‌ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. చూడబోతుంటే ఈ సారి నితిన్‌ స్ట్రాంగ్‌ కంటెంట్‌తోనే రాబోతున్నట్టు అర్థమవుతుంది. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 4న విడుదల కాబోతుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్
Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు