టాలీవుడ్‌లో విషాదం.. బాలయ్య దర్శకుడు ఏఎస్‌ రవికుమార్ కన్నుమూత, కారణం ఏంటంటే?

Published : Jun 11, 2025, 10:39 AM IST
a s ravikumar chowdary

సారాంశం

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఏఎస్‌ రవికుమార్‌ చౌదరీ కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తుంది.

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు ఏఎస్ రవికుమార్‌ చౌదరి కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఆయన  గుండెపోటుతో  మరణించినట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌లో దర్శకుడిగా రాణించారు ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి. బాలకృష్ణ, గోపీచంద్‌, సాయి ధరమ్ తేజ్‌ వంటి హీరోలతో ఆయన మూవీస్‌ చేశారు.

ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి మృతి పట్ల చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి

ప్రస్తుతం దర్శకత్వానికి దూరంగా ఉన్న ఆయన హఠాన్మరణం తెలుగు చిత్ర పరిశ్రమని కలచి వేస్తుంది. ఆయన మృతిపట్ల ఇండస్ట్రీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. అయితే గత కొంత కాలంగా ఏఎస్‌ రవికుమార్‌ తన కుటుంబానికి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.  ఫ్యామిలీలో గొడవలు ఉన్న నేపథ్యంలో చాలా కాలంగా ఒంటరిగానే ఉంటున్నారు.

డిప్రెషన్‌లో దర్శకుడు

 గతేడాది ఆయన రాజ్‌ తరుణ్‌తో `తిరగబడరా సామీ`అనే చిత్రాన్ని రూపొందించారు. ఇది డిజాస్టర్‌ అయ్యింది. ఈ క్రమంలోనే దర్శకుడు డిజాప్పాయింట్‌లో ఉన్నట్టు సమాచారం.

సక్సెస్‌ లేకపోవడంతో చాలా కాలంగా ఒత్తిడిలో ఉన్నారని, కొంత మద్యానికి కూడా బానిసైనట్టు తెలుస్తోంది. ఇక దర్శకుడి మృతి పట్ల చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. 

అయితే రవికుమార్‌ చౌదరి నిజంగానే గుండెపోటుతో మరణించారా? సూసైడ్‌ చేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది. మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి దర్శకత్వం వహించిన సినిమాలు

దర్శకుడు ఏఎస్‌ రవికుమార్‌.. గోపీచంద్‌ హీరోగా వచ్చిన `యజ్ఞం` చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. ఆ తర్వాత బాలకృష్ణతో `వీరభద్ర` మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. 

ఇక సాయి ధరమ్‌ తేజ్‌ తో `పిల్లా నువ్వు లేని జీవితం` మూవీని రూపొందించారు. ఇది బాగానే ఆడింది. ఆ తర్వాత నితిన్‌తో `ఆటాడిస్తా` సినిమా చేశారు. ఇది కూడా డిజాస్టర్‌ అయ్యింది. 

దీంతో దర్శకుడిగా చాలా గ్యాప్‌ వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత రాజ్‌ తరుణ్‌తో `తిరగబడరా సామీ`ని రూపొందించగా, ఇది కూడా ఆడలేదు. దీంతో ఆయన మానసికంగా కుంగిపోయినట్టు సమాచారం.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

కమల్ హాసన్ సినిమాపై శ్రుతిహాసన్ ఆవేదన... అభిమానులపై సంచలన కామెంట్స్..
Chiranjeevi: చిరంజీవి సినిమా ఫ్లాప్ అయితే మందు పార్టీ చేసుకున్న హీరో.. చివరికి ఆంజనేయస్వామిపై ఒట్టేసి..