సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి కలకలం, ఉలిక్కిపడ్డ టాలీవుడ్

Published : Jun 11, 2025, 11:41 AM ISTUpdated : Jun 11, 2025, 02:32 PM IST
telugu singers, mangli

సారాంశం

టాలీవుడ్ లో మరోసారి మాదకద్రవ్యాల కలకలం రేగింది. ఇప్పటికే ఇండస్ట్రీలోమాదకద్రవ్యాల  ఇష్యూతో రచ్చ రచ్చ అవుతున్న క్రమంలో, మరోసారి బర్త్ డే పార్టీలో గంజాయి దొరకడం షాకింగ్ గా మారింది.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో మరో సారి మాదకద్రవ్యాల కలకలం రేగింది. ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా మాదకద్రవ్యాలు, గంజాయి, విదేశీ మద్యం పట్టుబడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మంగళవారం రాత్రి చేవెళ్ల మండలం పరిధిలోని త్రిపుర రిసార్టులో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, మంగ్లీ బర్త్‌డే వేడుకల కోసం త్రిపుర రిసార్టులో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, యంగ్స్ స్టార్స్ కూడా పెద్ద సంఖ్యలో హాజరయినట్టు తెలుస్తోంది. అయితే, ఈ పార్టీలో మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారన్న పక్కా సమాచారంతో స్థానిక పోలీసులు రాత్రి సోదాలు నిర్వహించారు.

పోలీసుల దాడుల్లో పెద్ద మొత్తంలో గంజాయి, వివిధ రకాల విదేశీ మద్యం , మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని  టెస్టులు చేశారు. సమాచారం ప్రకారం, కొందరికి గంజాయి, మరికొందరికి ఇతర మాదకద్రవ్యాల టెస్టులు పాజిటివ్‌గా వచ్చినట్లు తెలిసింది. మరికొన్ని పరీక్షల కోసం వారి బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించినట్టు పోలీసులు వెల్లడించారు.

ఈ పార్టీలో ఎవరెవరు హాజరయ్యారన్న విషయంపై స్పష్టత రాలేదు. మంగ్లీ మాదకద్రవ్యాలు తీసుకున్నారా లేదా అనే అంశంపై కూడా విచారణ కొనసాగుతోంది. సోదాల్లో పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. మాదకద్రవ్యాలు సరఫరా చేసిన వ్యక్తులపై దృష్టి పెట్టిన పోలీసులు, ఈ నెట్‌వర్క్ వెనక ఉన్న అసలు ముఠాను పట్టుకోవడం కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ ఘటనతో టాలీవుడ్‌లో మళ్లీ మాదకద్రవ్యాల వ్యవహారంపై చర్చలు మొదలయ్యాయి. గతంలో ఇలాంటి కేసులతో వివాదాల్లో మునిగిన ఇండస్ట్రీ, మరోసారి ఇలాంటి ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి, విచారణను కొనసాగిస్తున్నారు. ఈ పార్టీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

3000 కోట్లు వసూలు చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ, OTTలో ఆస్కార్ నామినీ బ్లాక్‌బస్టర్ ను ఎక్కడ చూడొచ్చంటే?
అప్పుడు జబర్దస్త్‌లో చేరమని పదేపదే కోరారు.. కానీ.! ఆ తర్వాత జరిగిందిదే: బలగం వేణు