Samantha: మరచిపోలేని సాయం చేసిన చైతు.. సమంత కామెంట్స్ వైరల్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 08, 2022, 05:30 PM ISTUpdated : Feb 08, 2022, 05:32 PM IST
Samantha: మరచిపోలేని సాయం చేసిన చైతు.. సమంత కామెంట్స్ వైరల్

సారాంశం

నాగ చైతన్య, సమంత గతేడాది విడిపోవడం చిత్ర పరిశ్రమలో ఊహించని పరిణామంగా మారింది. చాలా రోజుల పాటు ఈ విషయాన్ని అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు.

నాగ చైతన్య, సమంత గతేడాది విడిపోవడం చిత్ర పరిశ్రమలో ఊహించని పరిణామంగా మారింది. చాలా రోజుల పాటు ఈ విషయాన్ని అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న వీరిద్దరూ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనేది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న. ఇదిలా ఉండగా చైతు, సమంత ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు వెళుతున్నారు. ఇద్దరూ విడిపోయాక ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయారు. 

వీరిద్దరి మధ్య విడాకుల సంఘటన జరిగినప్పటి నుంచి ఏదో విధంగా ఇద్దరూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో సమంత పెట్టే పోస్ట్ లు ఆసక్తికరంగా మారాయి. ఆ మధ్యన సమంత తన ఇన్స్టాగ్రామ్ నుంచి విడాకుల ప్రకటనని డిలీట్ చేసింది. అప్పుడు చైతు, సమంత మళ్ళీ కలుస్తారా అంటూ జోరుగా చర్చ జరిగింది. ఇప్పుడు కూడా సమంత చేసిన కొన్ని కామెంట్స్ తో వీళ్లిద్దరూ మళ్ళీ కలవబోతున్నారు అనేదానికి సంకేతం అంటూ ప్రచారం జరుగుతోంది. 

అయితే అదంతా అవాస్తవం. సమంత నాగచైతన్య గురించి చేసిన కామెంట్స్ పాతవి. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ సమంత చైతు గురించి ఏం చెప్పిందంటే.. గతంలో చైతు తనకు సాయం చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంది. ఆ టైంలో నా దగ్గర డబ్బులు లేవు. కనీసం ఇంటికి ఫోన్ చేసి మా అమ్మతో మాట్లాడాలనుకున్నా ఫోన్ లో డబ్బులు లేవు. 

ఆ విషయం నాగ చైతన్య తెలుసుకుని వెంటనే తన ఫోన్ ఇచ్చాడు. ఎంతసేపైనా మాట్లాడుకో అని చెప్పాడు అంటూ సామ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. నాగ చైతన్య పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్ అంటూ ప్రశంసలు కురిపించింది. 

ఏ మాయ చేసావే చిత్రంతో చైతు, సమంత తొలిసారి కలుసుకున్నారు. ఇద్దరూ కలసి మల్టిపుల్ ఫిలిమ్స్ లో నటించిన తర్వాత ప్రేమ చిగురించింది. 2017లో పెద్దల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. నాలుగేళ్ళ వైవాహిక జీవితం తర్వాత తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. 

నాగ చైతన్య ఇటీవల బంగార్రాజుతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం థ్యాంక్యూ మూవీలో నటిస్తున్నాడు. ఇక సమంత యశోద అనే పాన్ ఇండియా మూవీ చేస్తోంది. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటించనుంది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం