
సినిమా వాళ్ల ప్రమోషన్స్ గమ్మత్తుగా ఉంటాయి.ఏదో విధంగా జనల్లో తమ సినిమా విషయం నలగాలనుకుంటారు. అందుకోసం రకరకాల స్కెచ్ లు వేస్తారు. ప్లాన్స్ చేస్తారు. అవి గమ్మత్తుగా ఉండి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూంటాయి. చారణా కోడికి బారణా మసాలా అంటే కోడి విలవ కంటే మసాలా ఖర్చు అధికం అని అర్దం. అలాగే నాలుగు నిముషాల పాటకి ఆరు నిముషాల ప్రోమో వదిలారు బీస్ట్ టీమ్.
తమిళ సూపర్ స్టార్ విజయ్ బీస్ట్(Beast) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్(pooja hegde)గా నటిస్తోంది. ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. బీస్ట్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. తమిళ సెన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమా కు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ఆసక్తిని క్రియేట్ చేసింది. చాలా రోజుల తర్వాత బీస్ట్ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు. బీస్ట్ నుండి ప్రేమికుల రోజు సందర్బంగా మొదటి పాటను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇదిలా ఉంటే.. లవర్స్ డే రోజు విడుదల చేసే పాట కోసం ప్రోమోను సిద్ధం చేస్తున్నారట. అయితే ఈ ప్రోమో ఏకంగా 6 నిముషాలు చేశారు.. కానీ పాట మాత్రం 4 నిమిషాలే ఉంటుందని తెలుస్తుంది. ఇందుకు సంబందించిన ఓ ఫన్నీ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాట ప్రోమో కోసం మరో స్టార్ హీరో శివకార్తికేయను కూడా రంగంలోకి దింపారు.. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి .. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రోమోలో పాట నేపథ్యం ను చూపించారు. వీడియో లో బీస్ట్ మ్యూజిక్ గురించి అనిరుధ్ మరియు దర్శకుడు నెల్సన్ లు మాట్లాడుకుంటూ ఉండగా ఒక మంచి పాటను చేద్దాం అని అరబిక్ పాటను చేస్తానంటూ అనిరుధ్ అంటాడు. అందుకు మొదట కన్ఫ్యూజ్ అయ్యి ఆ తర్వాత అనిరుధ్ కన్విన్స్ చేయడంతో ఓకే చెప్తాడు. అరబిక్ కుత్తు సాంగ్ కు లిరిక్స్ కావాలని అనిరుద్ అనడంతో దర్శకుడు నెల్సన్ ఫోన్ చేసి శివ కార్తికేయన్ ను పిలుస్తాడు. అప్పుడు ముగ్గురు కూడా అరబిక్ గెటప్స్ వేసుకుని మూడ్ కోసం అంటూ సరదాగా కామెడీ చేశారు. అరబిక్ కుత్తు పూర్తి చేసిన తర్వాత విజయ్ కి కాల్ చేయడం.. ఆయన అరబిక్ కుత్తు ఏంటీ అంటూ కౌంటర్ వేయడం మొత్తం వీడియో అంతా సరదాగా సాగి పోయింది.