Thaman Redy To Second Song: మహేష్ కోసం మరో ట్రీట్ కు రెడీ అవుతున్న తమన్. ఈసారి జాగ్రత్తగా..

Published : Feb 25, 2022, 02:35 PM IST
Thaman Redy To Second Song: మహేష్ కోసం మరో ట్రీట్ కు రెడీ అవుతున్న తమన్. ఈసారి జాగ్రత్తగా..

సారాంశం

టాలీవుడ్ లో వరుస మ్యూజిక్ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాడు తమన్. అటు దేవిశ్రీ రేసులో ఉండగా.. ముందుకు మిస్సైల్ లా దూసుకుపోతున్నాడు తమన్.

టాలీవుడ్ లో వరుస మ్యూజిక్ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాడు తమన్. అటు దేవిశ్రీ రేసులో ఉండగా.. ముందుకు మిస్సైల్ లా దూసుకుపోతున్నాడు తమన్.

రీసెంట్ గా భీమ్లా నాయక్ పాటలతో రచ్చ రచ్చ చేసిన తమన్.. అట్ ద సేమ్ టైమ్ సర్కారువారి పాటతో హడావిడి చేశాడు. సర్కారు వారి పాట నిం రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట కోసం చాలా కష్టపడ్డాడు తమన్. మహేష్ కోసం అందమైన.. అద్భుతమైన మ్యూజిక్ ట్రీట్ రెడీ చేయగా.. ఆ పాటపైరసీని ముందే నెట్టిట్లో పెట్టి షాక్ ఇచ్చారు సైబర్ నేరగాళ్లు. ఈ షాకింగ్ ట్విస్ట్ తో చాలా డిస్సపాయింట్ అయ్యాడు తమన్.

ఇక నెక్ట్స్ సాంగ్ కోసం పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం కళావతి పాట సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ  సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న తమన్ నెక్ట్స్ సాంగ్  ను ప్రిపేర్ చేస్తున్నామని. త్వరలోనే ఈ సినిమా నుంచి మరో సాంగ్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. అయితే ఫస్ట్ సాంగ్ లా మోస పోకుండా ఈసారి టెక్నికల్ గా చాలా జాగ్రత్తగా వ్యవహరించబోతున్నారు టీమ్. సాంగ్ కాదు కదా.. బ్యూజిక్ బిట్ కూడా బయటకు పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో తమన్ తో పాటు నిర్మాతలు కూడా పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ సాంగ్ ఇలా అయినా..సెకండ్ సాంగ్ తో మహేష్ కు సర్ ప్రైజిట్ ట్రీట్ ను ప్లాన్ చేస్తున్నారట తమన్.

 

పుష్ప లాంటి పాటలు క్రియేట్ చేసిన సెన్సేషన్లు మర్చిపోకముందే..ఈ మధ్య కాలంలో చాలా తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్ ను రాబట్టిన పాటల్లో సర్కారువారి పాట సినిమాలోని కళావతి ఒకటిగా నిలిచింది. మహేశ్ బాబు - కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

మైత్రీ మూవీస్ తో కలిసి 14 రీల్స్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమా కోసం తన  శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారు. ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్  కళావతి పాట ఒక రేంజ్ లో జనంలోకి దూసుకుపోయింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ తో పాటు లైక్స్ ను  కూడా రాబట్టుకుంది.అనంత్  శ్రీరామ్ సాహిత్యం .. సిద్ శ్రీరామ్ ఆలాపన .. కొరియోగ్రఫీ విశేషంగా ఆకట్టుకున్నాయి. మే 12న సర్కారువారి పాట సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా