Anasuya: కనీస మానవత్వం లేదా... మళ్ళీ ఫైర్ అయిన యాంకర్ అనసూయ

Published : Feb 25, 2022, 01:47 PM ISTUpdated : Feb 25, 2022, 01:50 PM IST
Anasuya: కనీస మానవత్వం లేదా... మళ్ళీ ఫైర్ అయిన యాంకర్ అనసూయ

సారాంశం

నటి అనసూయ ఉక్రెయిన్ సంక్షోభంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.అనసూయ అభిప్రాయాన్ని ఓ నెటిజన్ ఖండించారు. భారత్ కి వ్యతిరేకంగా, పాకిస్థాన్ కి మద్దతుగా ఓటు వేసిన ఉక్రెయిన్ దేశంపై అంతగా జాలి పడాల్సిన అవసరం లేదని.. కామెంట్ చేశారు.

పొరుగు దేశం ఉక్రెయిన్(Russia Ukraine crisis) రష్యా దాడులతో కాలి బూడిద బుతుంది. సైన్యం కాల్పుల్లో వందలాది ఉక్రెయిన్ పౌరులు మరణించినట్లు సమాచారం అందుతుంది. ప్రపంచ దేశాలు ఉక్రెయిన్ దేశంపై రష్యా సైన్యం దాడులను ఖండిస్తున్నాయి. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని, యుద్ధం ఆపి శాంతి నెలకొల్పాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్, నటి అనసూయ ఉక్రెయిన్ సంక్షోభంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ దేశ పరిస్థితి తలచుకుంటే గుండె పగిలిపోతుంది. వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. 2015లో ఉక్రెయిన్ ఓ షూట్ కోసం వెళ్ళాను. 

ఉక్రెయిన్ దేశాన్ని, ప్రజలను ఎంతగానో ప్రేమిస్తున్నాను. కుటుంబ సభ్యులతో పాటు ఉక్రెయిన్ వెళ్లాలనేది నా ప్రణాళికలో ఉంది. ఉక్రెయిన్ ఇలాంటి దుర్భర పరిస్థితిని ఎదుర్కోవడం దురదృష్టకరం... అంటూ ట్వీట్ చేశారు. అనసూయ అభిప్రాయాన్ని ఓ నెటిజన్ ఖండించారు. భారత్ కి వ్యతిరేకంగా, పాకిస్థాన్ కి మద్దతుగా ఓటు వేసిన ఉక్రెయిన్ దేశంపై అంతగా జాలి పడాల్సిన అవసరం లేదని.. కామెంట్ చేశారు. 

సదరు నెటిజెన్ అభిప్రాయానికి అనసూయ (Anasuya)రిప్లై ఇచ్చారు. రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలకు అమాయక ప్రజల్ని తప్పుబడతారా. ఇది అన్యాయం, నీలాంటి వాళ్ళు కొందరు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. కనీస మానవత్వం లేదా.. అంటూ అనసూయ ఒకింత ఫైర్ అయ్యారు. అనసూయ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఉక్రెయిన్ దేశంలో అనేక మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుని ఉన్నారు. వారందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. 

ఉక్రెయిన్ దేశంలోని ప్రధాన నగరాలను రష్యా సైన్యం ఆక్రమించుకుంది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న భయానక పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంలో మొండిగా ముందుకు వెళుతున్నారు. మా విషయంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఉక్రెయిన్ పై యుద్ధం విరమించాలని ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. ఉక్రెయిన్ సంక్షోభం భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరుకుంది. ఇది పెట్రోల్ రేట్లు మరింత పెరగడానికి కారణం కావచ్చు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా