
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), డైరెక్టర్ పరశురామ్ పెట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రొమాంటిక్ సాంగ్ ‘కళావతి’ని రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరు సాంగ్ ట్రైండ్ అవుతూనే ఉంది. ఇప్పటిే ఈ సాంగ్ ఇటు సోషల్ మీడియాలో, ఇంటర్నేట్ లో మారుమోగుతోంది. థమన్ (Thaman) క్యాచీ టూన్ ఇవ్వడం, సిద్ధ్ శ్రీరామ్ గాత్రం, అనంత శ్రీ రామ్ రాసిన లిరిక్స్ కు తెలుగు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. అలాగే స్టార్ కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ ను డైరెక్ట్ చేశారు. ట్రెండీ స్టెప్పులతో, ఆకట్టుకునే డాన్స్ మూమెంట్స్ ఉండటం మరింత ట్రెండ్ అవుతోంది. సెలబ్రెటీలు, ఫ్యాన్స్ మహేశ్ వేసిన స్టెప్పులను రిపీట్ చేస్తున్నారు.
తాజాగా ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించిన థమన్, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Shekar Master) లు కలిసి డాన్స్ చేశారు. మహేశ్ బాబు చేసిన లెగ్ మూమెంట్ ను చేస్తూ అదరగొట్టారు. ఈ సందర్భంగా చిత్రీకరించిన వీడియోను థమన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. అయితే థమన్ వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంత భారీ శరీరంతోనూ శేఖర్ మాస్టర్ తో డాన్స్ మ్యాచ్ చేసే ప్రయత్నం చేశాడంటూ పొగుడుతున్నారు. మరోవైపు ఆయన డాన్స్ తీరుకు సరదాగా నవ్వుకుంటుున్నారు కూడా.. తన డాన్స్ కు థమన్ కూడా కొంత షై ఫీలయ్యారు. ‘సిగ్గుతో.. నన్ను నేనే.... కలిసి డాన్స్ చేసినందుకు థాంక్స్ శేఖర్ మాస్టర్’ అంటూ నోట్ రాశారు.
ఇక ఈ సాంగ్ దాదాపు 42 మిలియన్ల వ్యూస్ ను సాధించింది. 50 మిలియన్స్ వ్యూస్ దక్కించుకునే దిశగా పరుగులు తీస్తోంది. సాంగ్ రిలీజ్ అయ్యి పది రోజులైనా ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. ఇటీవల ఈ సాంగ్ కు హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తనను తానే ఛాలెంజ్ చేసుకుంటూ స్టెప్పులేసింది. అదేవిధంగా మహేశ్ బాబు డాటర్ ‘సితార’ కూడా అచ్చు తండ్రిలాగే డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరోవైపు డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) కూడా ఈ సాంగ్ లోని లిరిక్స్ ను ట్విట్టర్ లో షేర్ చేశాడు. ‘అద్భుతమైన లిరిక్స్, క్లాస్ కంపోసిషన్’ అంటూ పేర్కొన్నాడు.