TFI : తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి సమావేశం.. చిత్రపరిశ్రమ సమస్యలపై చర్చ

Published : Feb 23, 2022, 07:39 AM IST
TFI : తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి సమావేశం.. చిత్రపరిశ్రమ సమస్యలపై చర్చ

సారాంశం

సినీ పరిశ్రమకు చెందిన 24 క్రాఫ్ట్స్ లో నెలకొన్న సమస్యలు, మరిన్ని చలన చిత్ర సమస్యల పరిష్కారంపై  తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి  నిర్వహించిన సమావేశం జయప్రదమైంది. అన్ని సెక్టార్స్ కు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా చిన్న సినిమాల మనుగడపై సభ్యులు ఈ సమావేశంలో చర్చించారు.  

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ - 24 క్రాఫ్ట్స్, తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ వారు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన విషయాలపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఈ నెల 20న ఘట్టమనేని ఆదిశేషగిరి రావు  అధ్యక్షతన నిర్వహించిన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి  సమావేశానికి అన్ని విభాగాల వారు హాజరయ్యారు. ఈ మేరకు  మంగళవారం ప్రకటన విడుదల చేశారు.  ఈ సమావేశంలో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు నారాయణ్ దాస్ కిషన్ దాస్ నారంగ్, కార్యదర్శులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్,  ఎం. రమేష పాల్గొన్నారు. 

ఈ సమావేశంలో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఆఫీస్ బేరర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫీస్ బేరర్స్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ఆఫీస్ బేరర్స్,  ఇండస్ట్రీ కి సంబంధించిన ప్రముఖులు, సినీ ఆర్టిస్టులు, డైరెక్టర్స్, ఎగ్జిబిటర్స్ , ప్రొడ్యూసర్స్, స్టూడియోస్, డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఫెడరేషన్ కు సంబంధించిన సభ్యులు పాల్గొని వారి సమస్యలను వివరించారు. 
 
ముఖ్యంగా ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న అడ్మిషన్ రేట్స్ మీద  ఇచ్చిన జి.ఓ.లను ఏవిధంగా  అమలుపరచాలనే విధానంపై చర్చించారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ వారి నియమ నిబంధనలు, ఫిలిం ట్రైలర్స్ , పబ్లిసిటీ ఛార్జెస్ , విపియఫ్ ఛార్జెస్, ఆన్లైన్ టిక్కెటింగ్ నడుపుతున్న సంస్థల మీద, వారి విధి విధానాలు, పర్సెంటేజ్ విధానం , ఓటిటి విధానం పలు విషయాల మీద అందరూ ఏకంగా ఉండిసానుకూలంగా పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 

అన్ని సెక్టార్స్ కు సంబంధించిన విషయాలను, ముఖ్యంగా చిన్న సినిమాలు మరింత మనుగడ సాధించుటకు అందరూ ఏకాభిప్రాయంతో ఉండాలని సమావేశంలో సభ్యులకు సూచించారు.  చిత్త శుద్ధితో ముందుకు వెళ్లేందుకు క్రుషి చేయాలని నిర్ణయించుకున్నారు. పరిశ్రమకు సంబంధించిన అన్ని విషయాలపై ఏక తాటిగా ఉండి సమస్యల పరిష్కారం దిశగా పయనించాలని సూచించారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన విషయాలపై ఫిలిం ఛాంబర్ ఒక హై లెవెల్ సబ్ కమిటీ నియమించి..  పైన పేర్కొన్న అంశాల మీద చర్చించేలా.. వాటిని అవలంభించే తీరుపై తగిన నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఏ విషయాన్నైనా ఫిలిం ఇండస్ట్రీకి పేరెంట్ బాడీ అయినా తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ద్వారా చర్చించి, తగిన నిర్ణయం తీసుకొని ముందడుగు వేసేలా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?