Thalapathy Vijay: గెలుపు తర్వాత విజయ్ ఫస్ట్ రియాక్షన్! మోదీ, రాహుల్ కు దళపతి కౌంటర్ ?

Published : May 06, 2026, 08:10 AM IST
Thalapathy Vijay Responds to PM Modi and Rahul Gandhi

సారాంశం

తమిళనాడు రాజకీయాల్లో సైలెంట్ గా సంచలనం సృష్టించాడు దళపతి విజయ్. దేశవ్యాప్తంగా తన పేరు మారుమోగేలా  చేశాడు . పార్టీ పెట్టిన రెండేళ్లలో అధికారంలోకి వచ్చిన విజయ్.. గెలుపు తరువాత ఫస్ట్ రియాక్షన్ ఏంటో తెలుసా? 

 విజయ్ దళపతి ప్రభంజనం

బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించే 'దళపతి' విజయ్ (Thalapathy Vijay), ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెను భూకంపం సృష్టించారు! ఇప్పటిదాకా వెండితెరపై విలన్లను చితక్కొట్టిన విజయ్, ఇప్పుడు నిజ జీవిత రాజకీయ రంగంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రావిడ పార్టీల కోటలను బద్దలుకొట్టారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితం కేవలం ఆశ్చర్యమే కాదు, అదొక కొత్త శకానికి నాంది!

కూలిన కోటలు, హవా సృష్టించిన టీవీకే

తమిళనాడు రాజకీయాలంటే డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) మధ్య జరిగే ఆటగానే అందరూ భావించారు. కానీ, "నేను రావడం లేటైనా.. లేటెస్ట్ గా వస్తాను్ " అన్నట్టుగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ.. ఏకంగా 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. జూన్ 1977 తర్వాత తమిళనాడు గడ్డపై ద్రావిడ పార్టీలు లేకుండా ఒక ప్రభుత్వం ఏర్పడటం ఇదే తొలిసారి. విజయ్ సాధించిన ఈ ఘనత ఇప్పుడు దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది.

మోదీ, రాహుల్ కి విజయ్ కౌంటర్!

విజయ్ సాధించిన ఈ అపూర్వ విజయంపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (X) ఖాతాలో అభినందనలు తెలిపారు. "తమిళనాడు ప్రగతికి, ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది" అని మోదీ పోస్ట్ చేశారు. దీనికి విజయ్ అంతే వినయంగా, అంతే ఘాటుగా స్పందించారు. "మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు మోదీ గారూ. మా ప్రజల సంక్షేమమే మా ఏకైక లక్ష్యం. రాజకీయాలు ఏవైనా, రాష్ట్ర అభివృద్ధికి మీ సపోర్ట్  కోసం ఎదురుచూస్తున్నాం" అని చెప్పి తన పరిణతిని చాటుకున్నారు.

అంతేకాదు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఫోన్ కాల్, శుభాకాంక్షలకు కూడా విజయ్ ధన్యవాదాలు తెలిపారు. "తమిళనాడు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటానికి మేము కట్టుబడి ఉన్నాం" అని ఆయన స్పష్టం చేశారు.

సినిమాలకు గుడ్-బై చెప్పనున్నారా ?

విజయ్ దళపతి ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైపోయింది. ఈ వార్తతో అభిమానులకు ఒకవైపు ఆనందంగా ఉన్నా, మరోవైపు చిన్న బాధ కూడా ఉంది. అదేంటంటే, రాజకీయాల్లో పూర్తిస్థాయిలో నిమగ్నమవ్వడానికి విజయ్ సినిమాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఆయన చివరి చిత్రంగా భావిస్తున్న 'జన నాయకన్' సినిమాపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఈసినిమా రిలీజ్ కు ఇక అడ్డంకులు ఉండవని అభిమానులు భావిస్తున్నారు. 

ఏ పెద్ద పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా, ఒంటరిగా పోరాడి గెలిచిన ఈ 'దళపతి' ప్రయాణం ఇప్పుడు కొత్త దిశలో సాగుతోంది. మొత్తానికి, తమిళనాడు ఇప్పుడు కేవలం సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ తన 'సూపర్ స్టార్'ను సీఎం కుర్చీలో చూసేందుకు రెడీ అయింది!

PREV
Read more Articles on
click me!

Recommended Stories

10 కోట్లు లోన్ తీసుకుని 100 కోట్లు సంపాదించిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎలా సాధ్యం అయ్యింది?
Vijay Fitness: 50 లో కూడా 25 ఏళ్ల కుర్రాడిలా ఎలా ? దళపతి విజయ్ డైట్ సీక్రెట్ ఇదే