‘లియో’ సక్సెస్ మీట్ లో.. పొలిటికల్ ఎంట్రీపై విజయ్ దళపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

By Asianet News  |  First Published Nov 2, 2023, 12:48 PM IST

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి తాజాగా ‘లియో’ సక్సెస్ మీట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ స్పీచ్ తో ఆకట్టుకున్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీపైనా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.   
 


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy)  నటించిన లేటెస్ట్ ఫిల్మ్ Leo The Film.  సెన్సేషనల్ డైరెక్టర్ లోకేషన్ కనగరాజ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్డ్స్ టాక్ దక్కించుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ కలెక్షన్లను రాబ్టటింది. రెండో వారం ముగింపు వరకు రూ.540 కోట్ల మేర ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు అందుకుంది. 

కలెక్షన్ల విషయంలో మంచి రిజల్ట్ అందుకున్న ఈ చిత్రం సక్సెస్ మీట్ ను నిన్న తమిళనాడులో గ్రాండ్ గా నిర్వహించారు. నెహ్రూ ఇండోర్ స్టేడియం చెన్నైలో జరిగిన ఈ విజయోత్సవానికి అభిమానులుతో పాటు  
ఈ సందర్భంగా యూనిట్, కాస్ట్ హాజరైంది. విజయ్ దళపతి, త్రిష, లోకేష్ కనగరాజ్ ఈవెంట్ కు అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా విజయ్ దళపతి స్పీచ్ ఆసక్తికరంగా మారింది. 

Latest Videos

undefined

విజయ్ కొన్ని అంశాలను టచ్ చేస్తూ మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన పొటికల్ ఎంట్రీపైనా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపైనా స్పందించారు. 2026 గురించి అడిగిన ప్రశ్నకు.. విజయ్ దళపతి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. ‘ కప్ మాత్రమే ముఖ్యం బిగిలు’ అంటూ ఇచ్చిన రిప్లై ఆసక్తికరంగా మారింది. దీంతో తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ దళపతి ఎంట్రీపై ఇలా హింట్ ఇచ్చారని అంటున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 

మరోవైపు  తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు విజయ్ ఫ్యాన్స్ మధ్య కొద్దిరోజులుగా ‘సూపర్ స్టార్ స్టేటస్’పై వార్ జరుగుతోంది. దీనిపైనా స్పందించారు విజయ్. ఇక్కడ ఒక్కరే పురట్చి తలైవర్ ఎంజీఆర్, ఒకే ఒక్క నడిగర్ తిలగన్ శివాజీ గణేశన్, ఒకే ఒక్క కెప్టెన్ విజయకాంత్, ఒకే ఒక్క ఉలగనాయగన్ కమల్ హాసన్, ఒకే ఒక్క సూపర్ స్టార్ రజినీకాంత్ అని చెప్పుకొచ్చారు. అలాగే తల అజిత్ కుమార్. ఇక మీరు నాకిచ్చిన పేరు దళపతి. అంటే రాజుల నుండి ఆదేశాలు తీసుకునే సైనికుడని అర్థం.  నాకు మీరందరూ రాజులు. నేను మీ దళపతిని. నేను మీ సేవకు ఉన్నాను అని వివరించారు. 
దీంతో ఫ్యాన్ వార్ కు చెక్ పెట్టారు. అలాగే భారతీయర్, అబ్దుల్ కలామ్ మాటలను గుర్తు చేశారు. అభిమానులు తమ జీవితాల్లోనూ పెద్ద లక్ష్యాలను పెట్టుకోవాలని, గోల్స్ ను రీచ్ అవ్వడమే తమకు ప్రధాన లక్ష్యం కావాలని సూచించారు. దళపతి స్పీచ్ ఇలా ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. 

click me!