అతనో చెత్త కంటెస్టెంట్, బిగ్ బాస్ 7 పై మానస్ సంచలన కామెంట్స్ , మరి సపోర్ట్ ఎవరికి..?

Published : Nov 02, 2023, 12:07 PM IST
అతనో చెత్త కంటెస్టెంట్, బిగ్ బాస్ 7 పై మానస్ సంచలన కామెంట్స్ , మరి సపోర్ట్ ఎవరికి..?

సారాంశం

టాలీవుడ్ నటుడు.. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్ శివాజీపై  షాకింగ్ కామెంట్స్ చేశాడు.. బుల్లితెర నటుడు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్. ఇంతకీ అతను ఏమంటున్నాడంటే..?   

ఇంతకు మందు ఆరుసిజన్ల కన్నా.. డిఫరెంట్ గా నడుస్తుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 7. ఈ సీజన్ లో పగలు ప్రతీకారాలు, గొడవలు, కొట్లాటల వరకూ డోస్ ఇంతకు ముందు కంటే పెరిగింది. ఈసారిలవ్ స్టోరీలకు పెద్దగా స్పేస్ లేదు కాని.. ఎక్కువగా రివేంజ్ స్టోరీలే కనిపిస్తున్నాయి. అరుపులు కేకలతో బిగ్ బాస్ హౌస్ దద్దరిల్లిపోతోంది. ఈక్రమంలో సీరియల్ బ్యాచ్.. వర్సెస్ ఇతరలు అన్నట్టుగా హౌస్ లో పోరు సాగుతోంది. ఎవరు ఎప్పుడు ఎవరిపై మండిపడతారో తెలియనిపరిస్థితి. 

గత సీజన్ల అనుభవంతో.. ఈసారి చాలా జాగ్రత్త పడ్డారు బిగ్ బాస్ మేకర్స్.. దాంతో ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన అన్నీ సీజన్స్ లోకి సీజన్ 7 కి అత్యధిక రేటింగ్స్ వస్తున్నాయని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ లో అమర్ దీప్ మరియు శివాజీ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.. ఈ విషయంలో శివాజీ తెలివిగా ప్రవర్తిస్తూ..అమర్ దీప్ తో ఆడుకుంటున్నాడు అన్న అభిప్రాయంచాలా మందిలో ఉంది. బయట కూడాచాలా మంది ఈ విషయంలో అమర్ దీప్ కు సానుభూతి తెలుపుతున్నారు.అటు శివాజీపై విమర్షలు కూడా చేస్తున్నారు ఈక్రమంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్.. బుల్లితెర స్టార్ మానస్ ఈ విషయంలో స్పందించారు. 

ఆయన మాట్లాడుతూ ప్రతీ సీజన్ లో శివాజీ లాంటి విలన్స్ ఉంటారు, కానీ హీరో ఎవరు అనేది జనాలే తెలుస్తారు అంటూ కామెంట్స్ చేసాడు. శివాజీ కేవలం ఇద్దరి పట్ల మాత్రమే వ్యక్తిగత ఇష్టం చూపిస్తున్నాడు. అలాగే మిగిలిన కంటెస్టెంట్స్ అందరి ఆట ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని, నేను ఇది వరకు ఎంతో మంది రకరకాల మైండ్ సెట్ ఉన్న కంటెస్టెంట్స్ ని చూసాను కానీ, శివాజీ లాంటి కంటెస్టెంట్ ని ఇప్పటి వరకు చూడలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు మానస్. 

ఇక అమర్ దీప్, మానస్ బెస్ట్ ఫ్రెండ్స్. అమర్ దీప్ ఇండస్ట్రీకి రావడంతో మానస్ ఎంతో సహాయపడినట్టు తెలుస్తోంది. ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉండే ఈ ఇద్దరు.. ఎప్పుడు ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటుంటారు. ఈక్రమంలో బిగ్ బాస్ హౌస్ లో తన మిత్రుడు పడుతున్న ఇబ్బంది చూసి..అమర్ ను టార్గెట్ చేసినవారిపై మండిపడ్డాడు మానస్ .ముఖ్యంగా శివాజీపై అతను చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు