తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalpathy) తాజాగా ఇన్ స్టా అకౌంట్ ఓపెన్ చేశారు. ఇవాళే ఫస్ట్ పోస్టు కూడా పెట్టి సెన్సేషన్ గా మారారు. అంతే కాదు సోషల్ మీడియాలో సరికొత్త రికార్డునూ క్రియేట్ చేశారు.
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతికి సౌత్ లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందినా తన చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకుల్లో నటుడిగా మంచి పేరు దక్కించుకున్నారు. నార్త్ లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. స్టార్ హీరోగా దుమ్ములేపుతున్న విజయ్ ఇప్పటి వరకు సోషల్ మీడియాలో కనిపించలేదు. ఇక తాజాగా సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. అయితే గతంలోనే ట్విటర్ ఖాత్ ఓపెన్ చేసి ఏకంగా 4.4 మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకున్నారు.
ఈరోజు ఇన్ స్టా అకౌంట్ ను కూడా తెరిచారు. ఇన్నాళ్లకు విజయ్ దళపతి సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా కొలీవుడ్ స్టార్స్ ఆయనకు వెల్కమ్ చెబుతున్నారు. @actorvijay ఇన్ స్టా అకౌంట్ ను ఫాలో అవుతూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. రష్మిక మందన్న, కీర్తి సురేష్, ప్రియాంక మోహన్, ఐశ్వర్య రాజేశ్, థమన్ ఫాలో అవుతున్నారు. విజయ్ మాత్రం ఎవ్వరినీ కూడా ఫాలో చేయడం లేదు. అయితే ఈరోజే ఫస్ట్ పోస్ట్ పెట్టడంతో 11 లక్షలకు పైగా లైక్స్ అందాయి. అయితే విజయ్ అకౌంట్ ఓపెన్ చేసిన రోజు కేవలం రెండు గంటల్లోనే 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారని తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యింది.
గతంలో తమిళ స్టార్ సూర్య ఇన్ స్టా అకౌంట్ ఓపెన్ చేయగా.. 28 గంటల్లో 1 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. దీంతో ఫాస్టెస్ట్ ఇన్ గ్రామ్ ఫాలోవర్స్ జాబితాలో ఇప్పటి వరకు సూర్యనే ముందున్నారు. ఈ రికార్డును తాజాగా విజయ్ తుడిచేశారు. కేవలం 99 నిమిషాల్లోనే 1 మిలియన్ ఫాలోవర్స్ ను దక్కించుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఒక పోస్టు కూడా పెట్టారు. తను నటిస్తున్న ‘లియో’ చిత్రం సెట్స్ నుంచి ఓ అదిరిపోయే స్టిల్ ను షేర్ చేసుకున్నారు. ఆ ఫొటోనే డీపీగానూ సెట్ చేసుకున్నారు.
చివరిగా ‘వరిసు’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న దళపతి ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘లియో’ LEOలో నటిస్తున్నారు. ఇప్పటికే కశ్మీర్ షెడ్యూల్ ను పూర్తి చేసుకొని చెన్నైకి చేరుకున్నారు. రీసెంట్ గా మారో షెడ్యూల్ కూడా ప్రారంభం అయ్యింది. ఈ చిత్రంలో హీరోయిన్ త్రిష విజయ్ కు జంటగా నటిస్తోంది. సెవెన్ స్కీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి నిర్మిస్తున్నారు. రూ.250 నుంచి రూ.300 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 19న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.