ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ‘బలగం’ చిత్రానికి ప్రేక్షకులకు బ్రహ్మ రథం పడుతున్నారు. దీంతో సినిమాకు అవార్డులు కూడా దక్కుతున్నాయి. తాజాగా మరో ప్రతిష్టాత్మకమైన పురస్కారం అందింది.
కుటుంబ సంబంధాలు, అనుబంధాలు, ప్రేమానురాగాల నేపథ్యంలో తెలంగాణ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘బలగం’ Balagam. స్టార్ కమెడియన్ గా నవ్వులు పూయించిన వేణు యెల్దండి ఈ చిత్రంతో అందరీ హ్రుదయాలను గెలుచుకున్నారు. తెలంగాణ పల్లెల్లోని, కుటుంబాల్లోని ఎమోషన్స్ ను తెరపైకి తెచ్చి ప్రశంసలు అందుకుంటున్నారు. మార్చి 3న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నాు. దీంతో ఇప్పటికీ విజయవంతంగా రన్ అవుతోంది. మరోవైపు అవార్డులను దక్కించుకుంటోంది.
తాజాగా అందిన అవార్డుతో కలుపుకొని మొత్తం నాలుగు అవార్డులు సొంతం చేసుకుంది బలగం. తొలుత ఉగాది సందర్భంగా తెలుగు సినిమా వేదిక నుంచి నంది అవార్డు వరించింది. ఈ విషయాన్ని దర్శకుడు వేణు తెలియజేస్తూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. రెండ్రోజుల కింద రెండు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. లాస్ ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఉక్రెయిన్ లోని ఒనికో ఫిల్మ్ అవార్డ్స్ నుంచి బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డును సొంతం చేసుకుంది. ఇలా బలగానికి మొత్తంగా నాలుగు అవార్డులు దక్కాయని దర్శకుడు వేణు సంతోషం వ్యక్తం చేశారు.
Naa BALAGAM ki
3rd award..
Balagam shines on the global stage! 🤩❤️
Congratulations to our director pic.twitter.com/0tmjN606EQ
ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బలగం’ ప్రేక్షకాదరణ పొందుతూనే అవార్డులను సైతం దక్కించుకుంటోంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద తగిన కలెక్షన్లే రాబడుతోంది. చిత్రానికి వేణు దర్శకత్వం వహించగా శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తోపాటు రచ్చ రవి ముఖ్య పాత్ర పోషించారు. చిత్రానికి భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం అద్భుతంగా ఉంది.
No 4 to balagam
Breaking barriers and captivating audiences 🤩❤️ takes home the Best Drama Feature Film award at Onyko Film Awards in Ukraine! ✨
Thank you all for making this possible!! 🤗🤗
pic.twitter.com/NiZ5e4wKUw