RK Selvamani: రోజా భర్తకు షాకిచ్చిన స్టార్ హీరో.. ఆయన్ని ఆపడం సాధ్యమేనా ?

Published : May 06, 2022, 04:55 PM IST
RK Selvamani: రోజా భర్తకు షాకిచ్చిన స్టార్ హీరో.. ఆయన్ని ఆపడం సాధ్యమేనా ?

సారాంశం

ఏపీ మంత్రి, నటి రోజా భర్త సెల్వమణి ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సెల్వమణి అధ్యక్షుడిగా ఒక తీర్మానం చేశారు.

ఏపీ మంత్రి, నటి రోజా భర్త సెల్వమణి ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సెల్వమణి అధ్యక్షుడిగా ఒక తీర్మానం చేశారు. తమిళ హీరోలు ఇతర రాష్ట్రాల్లో షూటింగ్ లు నిర్వహించకూడదు అని నిర్ణయించారు. ముఖ్యంగా స్టార్ హీరోలు తమిళనాడు లోనే షూటింగ్స్ చేసుకోవాలని సూచించారు. 

అజిత్ లాంటి అగ్ర హీరోలు తరచుగా హైదరాబాద్ లో షూటింగ్స్ చేస్తున్నారని తద్వారా.. తమిళనాడులో సినీ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని సెల్వమణి పేర్కొన్నారు. అజిత్ తో సెల్వమణి స్వయంగా మాట్లాడారట. దీనితో అజిత్ ఇకపై తన సినిమా షూటింగ్స్ చెన్నై, తమిళనాడులోనే ఇతర ప్రాంతాల్లోనే ఉండేలా చూసుకొంటానని హామీ ఇచ్చారట. 

కానీ తాజాగా సెల్వమణికి ఊహించని షాక్ ఎదురైంది. కోలీవుడ్ అగ్ర హీరో ఇళయదళపతి విజయ్ తన తదుపరి చిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ తన 66 వ చిత్రం కోసం టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. 

ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తీర్మానాన్ని, సెల్వమణి మాటని పట్టించుకోకుండా విజయ్ తన సినిమా షూటింగ్ ని హైదరాబాద్ లో చేస్తున్నారు. ఇది కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కానీ విజయ్ కి ఎదురు చెప్పే సాహసం ఎవరూ చేయలేరనే టాక్ కూడా కోలీవుడ్ లో నడుస్తోంది. విజయ్ ఎలాంటి వ్యవహారాల్లో తలదూర్చరు. తన పని తాను చేసుకుంటారు. అలాగే తనకి సంబంధించిన వ్యవహారాల్లో ఆయన నిర్ణయమే ఫైనల్ అని విజయ్ ఫ్యాన్స్ అంటున్నారు. 

విజయ్ చివరగా బీస్ట్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం వసూళ్ల పరంగా యావరేజ్ గా నిలిచింది. ఫ్యాన్స్ ని సైతం ఆకట్టుకోలేకపోయింది. విజయ్ తొలిసారి తెలుగు మూవీలో నటిస్తుండడంతో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే