తన తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన దళపతి విజయ్.. షాకింగ్ రీజన్

By telugu teamFirst Published Sep 19, 2021, 5:08 PM IST
Highlights

విజయ్ తన సొంత తల్లిదండ్రులపైనే కేసు నమోదు చేశాడు. ఈ వార్త అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఇళయదళపతి విజయ్ తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ దక్కించుకున్నాడు. అద్భుతమైన నటన, సందేశాత్మక చిత్రాలు చేయడం, అభిమానులతో మమేకం కావడం లాంటి అంశాలు విజయ్ క్రేజ్ కి కారణంగా నిలిచాయి. గత రెండు మూడు సంవత్సరాలుగా విజయ్ పరాజయం లేకుండా దూసుకుపోతున్నాడు. 

విజయ్ నటించిన చిత్రాలు వివాదాల్లో నిలిచాయి కానీ.. అతడు మాత్రం వ్యక్తిగతంగా వివాదాలకు దూరంగా ఉంటాడు. తాజాగా విజయ్ తీసుకున్న నిర్ణయం అతడి అభిమానులకు కూడా షాకింగ్ గా మారింది. 

విజయ్ తన సొంత తల్లిదండ్రులపైనే కేసు నమోదు చేశాడు. ఈ వార్త అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. నిజంగానే విజయ్ తన పేరెంట్స్ పై కేసు నమోదు చేశాడు. విజయ్ తన తల్లిదండ్రులు చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ తో పాటు 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో కేసు పెట్టాడు. 

గత ఏడాది విజయ్ తండ్రి 'ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్' పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. ఈ పార్టీకి విజయ్ తండ్రి చంద్రశేఖర్ జనరల్ సెక్రటరీగా, విజయ్ తల్లి శోభా కోశాధికారిగా ఉన్నారు. ఈ పార్టీ స్ధాపంచిన కొద్ది రోజులకే విజయ్ వైపు నుంచి ప్రకటన వచ్చింది. 

తన తండ్రి స్థాపించిన రాజకీయ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. తన తండ్రి స్థాపించిన పార్టీలో తన అభిమానులు ఎవరూ చేరవద్దని కూడా విజయ్ సూచించాడు. పార్టీ కోసం తన పేరును, ఫోటోలను, ఫ్యాన్స్ క్లబ్ ని ఉపయోగించుకోకూడదని కూడా ప్రకటనలో విజయ్ స్పష్టం చేశాడు. 

ఇకపై తన పేరుతో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకుండా ఉండేందుకు విజయ్ తాజాగా కోర్టులో కేసు పెట్టినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27న దీనిపై విచారణ జరగనుందట. 

ఇక గత రెండేళ్లుగా విజయ్ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు కోరుతున్న సంగతి తెలిసిందే. భవిష్యత్తులో విజయ్ తప్పకుండ రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సర్కార్ ఆడియో వేడుకలో విజయ్ చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి. 'ఒక వేళ రియల్ లైఫ్ లో నేను సీఎం అయితే నేను నటించను.. సీఎంగా నా డ్యూటీని నిజాయతీతో చేస్తా' అని తెలిపాడు. 

click me!