రాంచరణ్ బిగ్ బాస్ షో జాకెట్ వైరల్.. ధర తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది!

pratap reddy   | Asianet News
Published : Sep 19, 2021, 02:37 PM IST
రాంచరణ్ బిగ్ బాస్ షో జాకెట్ వైరల్.. ధర తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది!

సారాంశం

మెగా పవర్ స్టార్ రాంచరణ్ వరుస భారీ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ వరుస భారీ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మూవీ కూడా రీసెంట్ గా లాంచ్ అయింది. 

మరోవైపు రాంచరణ్ ఎండార్స్మెంట్ లో కూడా దూసుకుపోతున్నాడు. ఇటీవల రాంచరణ్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ గా ఆ సంస్థతో డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీనితో హాట్ స్టార్ ప్రచారకర్తగా రాంచరణ్ రంగంలోకి దిగేశాడు. 

హాట్ స్టార్ కి ప్రచారం కల్పించడం కోసం రాంచరణ్.. బిగ్ బాస్ 5 షోలో మెరిశాడు. శనివారం ఎపిసోడ్ లో రాంచరణ్ నాగార్జునతో కలసి కాసేపు సందడి చేశాడు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో కాసేపు చరణ్ ముచ్చటించాడు. ఇక ఈ షోలో రాంచరణ్ ధరించిన జాకెట్ ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. 

బిగ్ బాస్ హౌస్ లో లోబో తన డ్రెస్సులతో ఎప్పుడూ విభిన్నంగా కనిపిస్తాడు. తాను ఈ రోజు లోబోలా రెడీ అయి వచ్చానని రాంచరణ్ స్టేజిపై జోకులు పేల్చాడు. ఇదిలా ఉండగా రాంచరణ్ ధరించిన జాకెట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 

విభిన్నంగా, స్టైల్ గా ఉన్న ఈ జాకెట్ గురించి నెటిజన్లు సెర్చ్ ఆపరేషన్స్ మొదలు పెట్టారు. కాగా ఈ జాకెట్ ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే. ఆకర్షించేలా ఉన్న ఈ జాకెట్ ధర రూ 1.3 లక్షలు. డస్ట్ ఆఫ్ గాడ్ సంస్థ ఈ జాకెట్స్ ని తయారు చేస్తోంది. ఈ ట్రెండీ జాకెట్ లో రాంచరణ్ సూపర్ స్టైలిష్ గా ఉన్నాడు. 

PREV
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్