సైకిల్‌పై వచ్చి ఓటేసిన విజయ్‌.. ఫోన్‌ లాక్కున్న అజిత్‌..

Published : Apr 06, 2021, 12:53 PM IST
సైకిల్‌పై వచ్చి ఓటేసిన విజయ్‌.. ఫోన్‌ లాక్కున్న అజిత్‌..

సారాంశం

తమిళనాడు ఎలక్షన్లలో సినీ తారలు సందడి చేశారు. తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇందులో విజయ్‌ సైకిల్‌ పై రావడం, అజిత్‌ అభిమాని సెల్‌ఫోన్‌ లాక్కోవడం హైలైట్‌గా మారింది. ప్రస్తుతం ఆయా వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. 

తమిళనాడు మొదటి దశ ఎన్నికలు మంగళవారం జరుగుతున్నాయి. ఇందులో సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే వీరిలో దళపతి విజయ్‌, తలా అజిత్‌ ఓటు హక్కు వినియోగించుకున్న తీరు ఇప్పుడు ఆసక్తికరంగా, వైరల్ గా మారింది. విజయ్‌ ఊహించని విధంగా పోలింగ్‌ సెంటర్‌కి సైకిల్‌పై వెళ్లడం విశేషం. ఆయన ఇంటి వద్ద నుంచి పోలింగ్‌ స్టేషన్‌ వరకు సైకిల్‌ తొక్కుతూ వెళ్లారు. చాలా వేగంగా ఆయన సైకిల్‌ తొక్కుతున్న తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. విజయ్‌ సైకిల్‌పై వెళ్తున్న విషయం గురించిన అభిమానులు, వాహనదారులు ఆయన్నీ ఫాలో అయ్యారు. కొందరు ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. విజయ్‌ సైకిల్‌పై రావడం హైలైట్‌గా మారింది. 

మరోవైపు అజిత్‌ తన భార్య షాలినితో కలిసి పోలింగ్‌ స్టేషన్‌కి వచ్చారు. ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ అజిత్‌ని చూసి అభిమానులు, అక్కడి జనం మొత్తం ఆయన్ని చుట్టు ముట్టారు. అజిత్‌, తలా అంటూ అరిచారు. కొందరు అజిత్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. దీంతో అజిత్‌కి కోపం వచ్చింది. తన అనుమతి లేకుండా సెల్ఫీ తీసుకుంటున్న ఓ అభిమాని సెల్ ఫోన్‌ లాక్కున్నాడు. లాక్కుని జేబులో పెట్టుకున్నాడు. అక్కడ ఉన్న వారందరిని వెళ్లిపోవాలంటూ మందలించారు. పక్కన ఉన్న పోలీసులు కూడా అభిమానులను చెదరగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

పూసలమ్మిన మోనాలిసా ఎంతగా మారిపోయిందో చూశారా
ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే