పండంటి బిడ్డకి జన్మనిచ్చిన బిగ్‌బాస్‌ బ్యూటీ హరితేజ

Published : Apr 06, 2021, 11:14 AM IST
పండంటి బిడ్డకి జన్మనిచ్చిన బిగ్‌బాస్‌ బ్యూటీ హరితేజ

సారాంశం

ప్రముఖ నటి, యాంకర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ హరితేజ పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. సోమవారం(ఏప్రిల్‌ 5) తాను ఆడబిడ్డకి జన్మనిచ్చినట్టు పేర్కొంది హరితేజ. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఇందులో `ఇట్స్ బేబీ గర్ల్` అని వెల్లడించింది. 

ప్రముఖ నటి, యాంకర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ హరితేజ పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. సోమవారం(ఏప్రిల్‌ 5) తాను ఆడబిడ్డకి జన్మనిచ్చినట్టు పేర్కొంది హరితేజ. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఇందులో `ఇట్స్ బేబీ గర్ల్` అని వెల్లడించింది. తాను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు భర్తతో కలిసి దిగిన ఫోటోని పంచుకుంటూ ఈ విషయాన్ని షేర్‌ చేసింది హరితేజ. దీంతో ఆమెకి విషెస్‌లు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది ఆమె తన ప్రెగ్నెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. 2015లో ఆమె దీపక్‌ని వివాహం చేసుకుంది.

బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో పాల్గొని పాపులర్‌ అయిన హరితేజ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. రెగ్యూలర్ గా తన ఫోటోలను పంచుకుంటూ, తనకు సంబంధించిన అప్‌డేట్స్ షేర్‌ చేస్తూ ఫ్యాన్స్ కి దగ్గరవుతుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. ఓ వైపు నటిగా రాణిస్తూనే మరోవైపు టీవీ షోస్‌లోనూ పాల్గొంటూ అలరిస్తుంది. ఆడియెన్స్ ని ఎంటర్టైన్‌ చేస్తుంది హరితేజ. ఇటీవల బిగ్‌బాస్‌ ఉత్సవంలో హరితేజకి అందరు కలిసి సీమంతం చేసిన విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్
అన్ని అనుభవించాలన్నదే నా కోరిక.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్