‘వకీల్‌ సాబ్‌’కి ఇది పరీక్షే, బయ్యర్లు సైతం..?

By Surya Prakash  |  First Published Apr 4, 2021, 7:19 AM IST

మొన్న ‘వకీల్ సాబ్’ ట్రైలర్ రిలీజ్ చేస్తే దాన్ని చూడ్డానికి ఫ్యాన్స్ ఏ స్దాయిలో హంగామా చేసారో...  థియేటర్లకు ఎలా పరుగులు పెట్టారో అందరికీ తెలిసిందే. అయితే బయిట పరిస్దితులు బాగోలేవు. 


కరోనా విరామం తర్వాత.. తెలుగులోనే కాదు, మొత్తం ఇండియాలోనే రిలీజవుతున్న అతి పెద్ద భారీ చిత్రం ఏదీ అంటే ‘వకీల్ సాబ్’ అనే చెప్పాలి. ఇంకో నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్న ‘వకీల్ సాబ్’ ట్రైలర్ రిలీజ్ చేస్తే దాన్ని చూడ్డానికి ఫ్యాన్స్ ఏ స్దాయిలో హంగామా చేసారో...  థియేటర్లకు ఎలా పరుగులు పెట్టారో అందరికీ తెలిసిందే. అయితే బయిట పరిస్దితులు బాగోలేవు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. ఆ ప్రభావం సినిమాలపై పడటం మొదలైంది. ఫ్యామిలీస్ కరోనా భయంతో థియోటర్స్ కు దూరంగా ఉంటున్నారు.. కింగ్ నాగార్జున తాజా చిత్రం వైల్డ్ డాక్ కు మినిమం ఓపినింగ్స్ లేవు. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఈ సినిమాకు ఇంత తక్కువ ఓపినింగ్స్ రావటానికి కారణం కరోనా భయమే అని తేల్చారు. 

ముఖ్యంగా తెలంగాణాలో విద్యాసంస్దలు మూసివేత దగ్గర నుంచి కరోనా భయం బాగా పెరిగిందని, అది సినిమాలపై పడిందని చెప్తున్నారు. ఈ నేపధ్యంలో వకీల్ సాబ్ పై కూడా ఈ ఇంపాక్ట్ పడనుందా అనేది చర్చగా మారింది. దాంతో  బయ్యర్లు... ఫిక్సెడ్ హైర్స్, మినిమం గ్యారంటీలు తక్కువ రేటుకు అడుగుతున్నారు. పవన్ కు ఉన్న క్రేజ్ తో మంచి ఓపినింగ్స్ వస్తాయని ధీమా ఉన్నా...ఫ్యాన్స్ షోలు అయ్యాక, రావాల్సిన ఫ్యామిలీలు థియోటర్స్ కు ఏ మేరకు కదులుతాయా అనే భయం అందిరిలోనూ ఉంది. 

Latest Videos

పవన్‌  కల్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాష్‌ రాజ్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 9న విడుదల కానుంది.  పవన్ కళ్యాణ్ త్వరలో సత్యదేవ్ పాత్రలో కనిపించి దుమ్ము రేపనున్నారు. 

వేణు శ్రీరామ్ మాట్లాడుతూ...హిందీలో వచ్చిన పింక్ మూలం మాత్రం అలాగే ఉందని ఆత్మను కొనసాగిస్తూనే.. పవన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని కథను అల్లుకున్నట్టు చెప్పారు. ముగ్గురు మహిళల కోణం నుంచి మొదలై.. పవన్ సెంటర్ స్టేజ్ తీసుకునేలా చిత్రం సాగుతుందని అన్నారు. అయితే.. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పేరు వకీల్ సాబ్ కాదని చెప్పారు దర్శకుడు. ఆయన క్యారెక్టర్ యాక్చువల్ పేరు ‘సత్యదేవ్’ అనీ.. అయితే పక్కన ఉన్నవాళ్లు మాత్రం వకీల్ సాబ్ అని పిలుస్తుంటారని తెలిపారు. అయితే.. వకీల్ సాబ్ అని ఎందుకు పిలవాల్సి వస్తుందో సినిమా చూశాక అర్థమవుతుందని అన్నారు. 

అలాగే వకీల్ సాబ్ సినిమాకు  పవన్ కళ్యాణ్ గారు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు. అలాగే చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు. ఇక సినిమా పూర్తయ్యాక చూసి వకీల్ సాబ్ విషయంలో ఆనందంగా ఉన్నారు. నిజానికి హీరోగా పవన్ కళ్యాణ్ అనే బిగ్ స్టార్ ఉన్నాడు కాబట్టి నాకు అనేక సవాళ్ళు ఎదురయ్యాయి. కానీ నేను అన్నివిధాలా సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. ముగ్గురు ఆడపిల్లల నేపథ్యం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ చుట్టూనే ఈ కథ తిరుగుతుంది' అని చెప్పుకొచ్చాడు. 
 
 ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘పవన్‌ కల్యాణ్‌ను బిగ్‌ స్క్రీన్‌ పై చూసేందుకు మనం మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నాం. వెయిటింగ్‌ పూర్తయింది. ట్రైలర్‌ బ్రేక్‌ఫాస్ట్‌ మాత్రమే. ఏప్రిల్‌ 9న లంచ్, డిన్నర్‌ కలిసి చేద్దాం’’ అన్నారు. ‘‘ట్రైలర్‌ కంటే సినిమా ఇంకా బాగుంటుంది’’ అన్నారు వేణు శ్రీరామ్‌. హిందీ హిట్‌  ‘పింక్‌’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ‘వకీల్‌ సాబ్‌’ రూపొందిన విషయం తెలిసిందే.

click me!