ఎట్టకేలకు లైన్‌ క్లీయర్‌.. పవన్‌ `వకీల్‌సాబ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి గ్రీన్‌ సిగ్నల్‌.. ఇక రచ్చ రచ్చే

Published : Apr 03, 2021, 09:05 PM ISTUpdated : Apr 03, 2021, 09:06 PM IST
ఎట్టకేలకు లైన్‌ క్లీయర్‌.. పవన్‌ `వకీల్‌సాబ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి గ్రీన్‌ సిగ్నల్‌.. ఇక రచ్చ రచ్చే

సారాంశం

పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి అనుమతి లభించింది. గ్రాండ్‌గా  ఈవెంట్‌ని ప్లాన్‌ చేస్తుంది చిత్ర బృందం. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో `వకీల్‌సాబ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేడుక జరుగనుంది. 

`వకీల్‌సాబ్‌`కి లైన్‌ క్లీయర్‌ అయ్యింది. గత వారం రోజులుగా నెలకొన్న సస్పెన్స్ కి తెరపడింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి పర్మిషన్‌ దొరికింది. ఆదివారం(ఏప్రిల్‌4) సాయంత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించేందుకు అనుమతి లభించింది. దీంతో గ్రాండ్‌గా ఈ ఈవెంట్‌ని ప్లాన్‌ చేస్తుంది చిత్ర బృందం. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో `వకీల్‌సాబ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేడుక జరుగనుంది. పవన్‌ కల్యాణ్‌ హీరోగా,  శృతి హాసన్‌ హీరోయిన్‌గా అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రధారులుగా ఈ చిత్రానికి దర్శకుడు వేణు శ్రీరామ్‌ రూపొందించారు. 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. ఈ నెల 9న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించాలని చిత్ర బృందం చాలా రోజులుగా ప్లాన్‌ చేస్తుంది. మొదట యూసఫ్‌ గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో అనుమతులు రద్దు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ దాదాపు మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తూ నటించిన సినిమా కావడంతో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తే భారీగా ఫ్యాన్స్ వస్తారని, క్రౌడ్‌ వల్ల కరోనా సోకే ప్రమాదం ఉందని, ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదనే టాక్‌ వినిపించింది. 

కానీ పవన్‌ లాంటి సినిమా విడుదలకు ముందు ఈవెంట్‌ లేకపోతే అది చాలా పెద్ద లోటే. ఫ్యాన్స్ కి పెద్ద అసంతృప్తిగా మిగిలిపోయే ఛాన్స్ ఉంది. దీంతో ఫ్యాన్స్ నుంచి, చిత్ర వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు అధికారులు ఎట్టకేలకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే కరోనా నిబంధనల మేరకు, అలాగే ఫ్యాన్స్ కి సంబంధించిన కొన్ని కండీషన్స్ తో ఈ అనుమతి లభించిందని సమాచారం. మరి ఈ వేడుక ఏ రేంజ్‌లో ఉండబోతుందో చూడాలి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు