రేపు షూటింగ్‌లు బంద్‌.. సూపర్‌స్టార్‌ కి సంతాపంగా తెలుగు నిర్మాతల మండలి నిర్ణయం..

Published : Nov 15, 2022, 05:24 PM ISTUpdated : Nov 15, 2022, 08:45 PM IST
రేపు షూటింగ్‌లు బంద్‌.. సూపర్‌స్టార్‌ కి సంతాపంగా తెలుగు నిర్మాతల మండలి నిర్ణయం..

సారాంశం

కృష్ణ మరణానికి సంతాప సూచకంగా తెలుగు నిర్మాతల మండలి ఓ నిర్ణయంతీసుకుంది. రేపు షూటింగ్‌లు బంద్‌కి పిలుపినిచ్చింది.

తెలుగు తెర దిగ్గజం, సూపర్‌ స్టార్‌ కృష్ణ మంగళవారం ఉదయం నాలుగు గంటల సమయంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. లెజెండరీ నటుడు కన్నుమూయడంతో టాలీవుడ్‌ శోకసంద్రంలో మునిగిపోయింది. కేవలం తెలుగు సినీ ప్రముఖులే కాదు, ఇండియన్‌ సినిమాకి చెందిన ప్రముఖులు సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌కిది ఓ చీకటి రోజుగా వర్ణిస్తున్న నేపథ్యంలో కృష్ణకి సంతాప సూచకంగా తెలుగు నిర్మాతల మండలి ఓ నిర్ణయంతీసుకుంది. రేపు షూటింగ్‌లు బంద్‌కి పిలుపినించింది. 

ఇదిలా ఉంటే కృష్ణ భౌతిక కాయానికి మొదట ఎల్లుండి అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు. రమేష్‌బాబు విదేశాల నుంచి రావాల్సి ఉన్న నేపథ్యంలో ఆయన రావడం ఆలస్యమవుతుందనే కారణంతో ఎల్లుండి(గురువారం) అంత్యక్రియలు చేయాలని మొదట అనుకున్నారట. కానీ రేపటి మధ్యాహ్నం వరకు మనవడు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు(బుధవారం) సాయంత్రం నిర్వహించాలనుకుంటున్నారు. 

కృష్ణ భౌతికకాయం ఇప్పుడు ఆయన నివాసం నానక్‌రామాగూడలో ఉంది. కాసేపట్లో ఆయన బాడీని గౌచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు. అక్కడ అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఈ రోజు సాయంత్రం నుంచి రేపు 2గంటల వరకు ఉంచనున్నారు. కృష్ణ లక్షలాది మంది అభిమానులున్న నేపథ్యంలో వారంతా ఆయన్ని కడసారి చూసేందుకు భారీగా తరలి వస్తున్నారని తెలుస్తుంది. అందుకోసం గచ్చిబౌలి స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. అభిమానుల సందర్శన అనంతరం సాయంత్రం మూడు, నాలుగు గంటల సమయంలో ఫిల్మ్ నగర్‌ లోని మహాప్రస్థానంలో కృష్ణ భౌతిక కాయానికి అంత్యక్రియలు పూర్తి చేయయనున్నారు. 

తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించింది. రేపే కృష్ణ అంత్యక్రియలు చేయనున్న నేపథ్యంలో రేపే షూటింగ్‌లకు బంద్‌కి పిలుపునిస్తూ తెలుగు నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గౌరవ కార్యదర్శులు టి. ప్రసన్న కుమార్‌, మోహన్‌ వడ్లపట్ల అధికారికంగా ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. మరోవైపు ఏపీలోనూ రేపు మార్నింగ్‌ షోలను రద్దు చేస్తూ ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకోవడం విశేషం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?
సమంత, అఖిల్ అక్కినేనితో పాటు 2025లో పెళ్లి చేసుకున్న 10 జంటలు ఎవరో తెలుసా?